తుప్పు పట్టిన మట్టి బుర్రలు - 420లకు నా విజన్ అర్థంకాదు! పనులు జెట్ స్పీడ్ తో.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

తుప్పు పట్టిన మట్టి బుర్రలు - 420లకు నా విజన్ అర్థంకాదు! పనులు జెట్ స్పీడ్ తో.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

  Sat Oct 19, 2024 17:55        Politics

గత ఐదేళ్లుగా మూలనపడిన రాజధాని అమరావతి పనులు నేడు మళ్లీ పట్టాలెక్కాయి. సీఆర్డీయే కార్యాలయ పనులకు ప్రారంభోత్సవం చేయడం ద్వారా సీఎం చంద్రబాబు అమరావతి పునర్ నిర్మాణానికి నేడు తెరలేపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశామని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని వెల్లడించారు. 2000 సంవత్సరం కంటే ముందు విజన్ 2020 అంటే ఎగతాళి చేసి 420 అన్నారు... కానీ విమర్శించిన వాళ్లే 420 లు అయ్యారని ఎద్దేవా చేశారు."నా విజన్ ఏంటో 420 లకు అర్థం కాదు... తెలీదు. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రగామిగా ఉండాలన్నది నా ధ్యేయం. మీ ఆదాయాలు పెంచుతాం. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి. ఒకప్పుడు థింక్ గ్లోబల్...యాక్ట్ లోకల్ అనే నినాదం ఉండేది. ఇప్పుడు థింగ్ గ్లోబల్...యాక్ట్ గ్లోబల్ గా ఉండాలి" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

ఇంకా చదవండి: 2022లో చేసిన ట్వీట్ ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు! ఎందుకో తెలుసా? ఇంతకీ అది ఏ పోస్ట్!



లక్ష కోట్టు ఖర్చు అంటూ తప్పుడు ప్రచారం..  

రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతాయని... తమ వద్ద డబ్బులేదని ఐదేళ్లపాటు కాలయాపన చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. హైదరాబాద్ లో కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు...భూమి ఇచ్చి నీళ్లు ఇచ్చాం. దీంతో అక్కడ సంపద సృష్టి జరిగింది. ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతి అభివృద్ధి చేస్తాం. అమరావతిని పట్టుకుని శ్మశానం, ఎడారి, మునిగిపోయిందని మాట్లాడుతున్నారు. వర్షాలకు చెన్నై, హైదరాబాద్ లో నీళ్లొచ్చాయి. బెంగళూరులో జగన్ కట్టుకున్న యలహంక ప్యాలెస్ లోకి నీళ్లు వచ్చాయి. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. 

పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి..

అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్ గా జరుగుతున్నాయి. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తాం. రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి. ప్రజలు గెలవాలి...రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చా. 

సుందర నగరంగా అమరావతి నిర్మాణం.. 

1,631
రోజులు పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారు. విధ్వంసం పోయింది... నిర్మాణం ప్రారంభమైంది. విధ్వంసం శాశ్వతం కాదు... అరాచకం శాశ్వతం కాదు... మనం చేసే మంచి పనులే శాశ్వతం. అమరావతిలో గత పాలకులు చేసిన విధ్వంసంతో నిలిచిన పనుల వల్ల రూ.7 వేల కోట్లు అదనంగా భారం పడుతోంది. రూ.52 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.15 వేల కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది.  దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్నది నా కల. కష్టాలు చూసి పారిపోయేవాడిని కాదు.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..

 

అర్ధ‌రాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్‌! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?

 

ఏపీలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ - భారీ లాభాలు సాధిస్తున్న లబ్దిదారులు! వారి కష్టాలు తీర్చేందుకు కూటమి సరికొత్త ఆలోచనతో!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!

 

నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!

 

నామినేటెడ్ పోస్టుల రెండవ విడత లిస్టు రేపే? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యుల సమావేశం తరువాత..?

 

మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?

 

జగన్‌కి షాక్ ఇచ్చిన లోకేష్.. పేదల సొమ్ముతో జగన్ లగ్జరీ! ఇన్నాళ్లు ఎంత మోసం చేశారు రా! జైలుకు పంపుతారా?

 

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం-సీఎం చంద్రబాబు! క్లీన్ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌లో కొత్త అవకాశాలు!

 

అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా..! ఇక తగ్గేదే లేదు అని అంటున్న అధికారులు!

 

వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!

 

48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

 

ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం!

 

ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu