రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!
Tue Oct 22, 2024 07:00 Politicsఈమధ్య కొంత సైలెంటుగా ఉన్న వైసీపీ నేతలు.. అప్పుడప్పుడూ వాయిస్ పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఐతే.. కూటమి ప్రభుత్వం ఈ విమర్శల్ని బలంగా తిప్పికొడుతోంది. అసలు విమర్శలు చేసే హక్కే లేదు అని కౌంటర్లు వేస్తోంది. తాజాగా మాజీ మంత్రి రోజా.. వైసీపీ అధికార ప్రతినిధిగా.. కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. “సీఎం చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రానికి దరిద్రం పట్టింది. మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా హత్యలు.. మానభంగాలు.. మహిళలు బయటకు వెళితే సురక్షితంగా ఇంటికి చేరే పరిస్థితి లేదు. ఇది రాక్షస పాలనకు ప్రతి రూపం” అని కామెంట్ చేశారు. రోజా ఓ విషయం మర్చిపోయారు. ఇదివరకు వైసీపీ పాలనలో ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు.. ఆమె రివర్సులో మాట్లాడారు. ఒకట్రెండు రేపులకే ఇంత రాద్దాంతమా అని అప్పటి ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు.
ఇంకా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ.. టీడీపీ కౌంటర్ ఇచ్చింది. “నువ్వు.. నువ్వు కూడా మాట్లాడుతున్నావా శ్రీలతా రెడ్డి అలియాస్ రోజా రెడ్డి.. మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే చూడలేక చస్తున్నాం, ఇప్పుడు నువ్వు.. 5 ఏళ్ళ పాటు తమరు చేసిన ఘనకార్యాలు, ప్రజలు మర్చిపోలేదు శ్రీలతా రెడ్డి.. అన్నీ గుర్తున్నాయి” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇలా ఒకప్పుడు రోజా మాట్లాడిన మాటలు ఆమెకే బూమరాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి తలెత్తింది. అప్పట్లో ఆమె సరిగ్గా వ్యవహరించి ఉంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదియ్యడానికి హక్కు ఉండేది. ఆమె చేసిన తప్పులు, ఇప్పుడు ఆమెకు సమస్యగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా టీడీపీ, వైసీపీ నుంచి ఎవరు విమర్శలు చేసినా.. గట్టిగా కౌంటర్లు వేసేస్తోంది. అంతేకాదు ప్రజలు కూడా భారీగా కామెంట్స్ పెడుతున్నారు. నువ్వే మరీ చెప్పాల్సింది.. నీ బాగోతం అంతా మాకు బాగా తెలుసు అని సీరియస్ వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.