రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!

Header Banner

రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!

  Tue Oct 22, 2024 08:57        Politics

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి వాళ్లు ఓర్వలేకపోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఘాటుగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి జనం హర్షిస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువుగా ముంచేశారని, అందుకే జనం ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారన్నారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకి పరిమితం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, అయినా వైసీపీ నేతలకు అవేమీ పట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వారి ఆచూకీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

 

 ఇంకా చదవండి: కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే ఉంచిన కొడుకు! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌లు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో పెద్దలను కలిసి నిధులు తెస్తున్నారని వివరించారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా సర్వ నాశనం చేశారని, గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన దారుణాలకు ఈ గంజాయి మత్తే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. దారుణాలకు పాల్పడిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తోందని చెప్పారు. జగన్ హయాంలో జరిగిన దారుణాలకు ఎంత మందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జత్వానీ కేసు విషయంలో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. విశాఖలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన వందల కోట్ల విలువైన భూ కేటాయింపును సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ సర్కార్‌లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంటే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతుందని చిన్ని విమర్శించారు.  

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!

 

రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!

 

దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!

 

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?

 

రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

 

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!

 

సీఎం చంద్రబాబుతో, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

 

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

 

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

 

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #mpkesineniChinni #TDP #YSRCP #YSJagan #RKRoja