Header Banner

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

  Tue Oct 22, 2024 16:46        Politics

దిల్లీ: కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రమంత్రి ఖట్టర్ దృష్టికి తెచ్చారు. అమృత్ పథకం అమలుపై కూడా కీలక చర్చ జరిగింది. మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఖట్టర్ చెప్పినట్టు సమాచారం.


ఇంకా చదవండిమనస్పర్థలతో చేయి కోసుకున్న ప్రియురాలు! అది చూసి గుండె ఆగి మరణించిన ప్రియుడు! అసలు ఏమి జరిగింది!


గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత ప్రభుత్వం మారడంతో మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. భూసేకరణనూ గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా కూటమి ప్రభుత్వ రాకతో మెట్రో ఎండీగా ఎన్పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్ మెట్రోకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్బీఎస్ నుంచి ఒక కారిడార్ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్ బందరు రోడ్డులో రానుంది. ప్రస్తుతం సుదీర్ఘ పైవంతెన ఎన్హెచ్ఎఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!

 

రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!

 

దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!

 

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?

 

రూ.కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

 

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!

 

సీఎం చంద్రబాబుతోబాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

 

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

 

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

 

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #muncipal #delhibeti #meetings #metroproject #development #vijayawada #maravathi #todaynews #flashnews #latestupdate