ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
Wed Oct 23, 2024 07:00 Politicsకూటమి ప్రభుత్వం ఏపీ మహిళలకు దీపావళి నుంచి కొత్త పథకాన్ని అమలు చేయనుంది. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండగ రోజున సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అర్హులైన వారికి సిలిండర్లను అందజేస్తారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. అర్హతలు, లబ్ధిదారులు.. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులంటే?. ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం లబ్ధిదారులు కూడా ఈ పథకానికి అర్హులు. ఇతర అర్హులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకే వర్తిస్తుంది. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే అర్హులు. అయితే అర్హతలు ఏంటన్నది ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. కావాల్సిన డాక్యుమెంట్లు.. ఈ పథకం కోసం లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకా చదవండి: ఇలాంటి వాళ్లు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గుచేటు! వైసీపీ విమర్శలకు నేడు ఘాటుగా బదులిచ్చిన హోంమంత్రి!
ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటుగా రేషన్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నెటివిటి సర్టిఫికెట్ కూడా అవసరం అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకానికి వీటినే ప్రామాణికంగా తీసుకున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ.. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, చిరుమానా వంటి వివరాలు సరిగా నమోదు చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, సబ్మిట్ చేయడం ద్వారా దరఖాస్తు పూర్తవుతుంది. అర్హుల జాబితా స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రభుత్వ భారం, ఖర్చు.. మూడు ఉచిత సిలిండర్ల పథకం అమలుతో ఏటా ప్రభుత్వం రూ.2,684 కోట్ల భారం పడుతుంది. ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగితే మరింత భారం ప్రభుత్వంపై పడనుంది. లబ్ధిదారులు ముందుగా గ్యాస్‌ని డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటే ఈ తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లో ఖాతాల్లో ప్రభుత్వం సబ్సిడీ మొత్తం జమ చేస్తుంది. లబ్ధిదారులకు సిలిండర్ల అందుబాటు: లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఒక సిలిండర్ ఫ్రీగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.876 సిలిండర్ ధరలో సబ్సిడీ భాగం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
తిరుపతిలో రాజకీయ కక్షలతో తెదేపా నేత హత్య! పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణం!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!
ఏపీపై ‘దానా’ తుఫాన్ దండయాత్ర.. 4 రోజులు అత్యంత భారీ వర్షాలు! ఆ జిల్లాల వారికి అలర్ట్!
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!
దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.