తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

Header Banner

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

  Thu Oct 24, 2024 08:28        Politics

చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలోని ఏ జీవిని చూసినా తల్లి తర్వాతేనని, జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుందని, కానీ ఈ కన్నీటి లేఖ (షర్మిల, విజయమ్మ)ను చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఓ వింత సైకో గురించి తెలుసుకుంటారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ అనే సైకో ఎలా వేధిస్తున్నాడో... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ... కన్నీళ్ళతో, సైకో జగన్‌కి చెల్లి షర్మిల లేఖ రాశారని, ఆ లేఖపై తల్లి విజయమ్మ సంతకం పెట్టారని పేర్కొంది. ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే... మన సమాజంలో ఉంటే... ఎంత ప్రమాదమో చెప్పటానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని పేర్కొంది. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయని, ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుందని పేర్కొంది.

ఇంకా చదవండి: ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?


ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్ళతో, ఓ సైకోకి రాసిన లేఖ..

"
మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నానని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి  మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా."

"
ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటి వరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా అణచివేశారు. కాబట్టి ఎంవోయూలో పేర్కొన్న విధంగా మేము ఒక పరిష్కారానికి అంగీకరించాము. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే  ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాను. ఆ విధంగా, 31.08.2019న అమలు చేయబడిన ఎంఓయూ ప్రకారం, నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి."

"
మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎంవోయూ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది."

"
ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం, దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేశారు. చట్టబద్దంగా  మీ కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి  సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు."

"
ఎంవోయూ ప్రకారం నా వాటాలో భాగంగా నాకు  ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, ఎంవోయూ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్, సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరికాదు. మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌లపై  సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి, కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్‌లో నాకు వాటాలు లేకుండా చేయాలనే మీ ఉద్దేశ్యంతో ఇది జరిగింది. చట్టబద్దంగా దాని మీద నాకు పూర్తి అర్హత ఉంది." అని షర్మిల రాసిన లేఖను టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది. ఈ సందర్భంగా జగన్‌పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నయ అన్న ప్రేమతో ఆస్తిలో తన సమాన వాటాను షర్మిల వదులుకున్నారని, కానీ జగన్ సొంత చెల్లి అని కూడా చూడకుండా దారుణంగా మోసం చేశాడని ఆరోపించింది. సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నాడని, అలాగే సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యాడంటూ జగన్‌పై మండిపడింది. చట్టబద్దంగా  కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవడానికి తన సొంత తల్లి, చెల్లి మీద కూడా కేసులు పెట్టాడని విమర్శలు గుప్పించింది. .జగన్ సైకో మనస్తత్వానికి  ఇదొక నిదర్శనమని పేర్కొంది. జగన్ ఆస్తుల కోసం తన సొంత తల్లి, చెల్లిని కూడా కోర్టుకి లాగాడని ఆరోపించింది.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!

 

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్‌.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్‌!

 

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples