అమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!

Header Banner

అమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!

  Thu Oct 24, 2024 20:10        Politics

ఏపీలో అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు.. వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో మొత్తం 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల రూ.2,245 కోట్లతో త్వరలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం మొదలవుతుంది. ఇందులో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి ఆమోదం కుదిరింది. అందువల్ల సీఎం చంద్రబాబు కోరిక ఒకటి నెరవేరబోతోంది. 10 రోజుల కిందట సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర పెద్దల్ని కలిసి.. అమరావతికి రైల్వే లైన్ కావాలని కోరారు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశమై.. అనేక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో అమరావతికి రైల్వే లైన్ ఒకటి. “చాలా తక్కువ సమయంలో.. నిర్ణయం తీసుకున్నారు. చాలా ధన్యవాదాలు. 10 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా ఇదే వేగంతో పనిచేస్తాం. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ దేశంలోని అన్ని నగరాలతో అమరావతి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 17వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ సహా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. 10 రోజుల్లో మీరు అన్నీ చేశారు. మేము కూడా అన్నీ చేస్తాం.

 

ఇంకా చదవండి: జగన్ లేఖకు షర్మిల ఘాటు రిప్లై! తల్లి, చెల్లిపై కేసుపెట్టి అధఃపాతాళానికి కూరుకుపోయావ్!

 

ఈ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు. వచ్చే నెల్లో ఈ రైల్వేలైన్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాను” అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని కీలక నగరాలను ఈ రైల్వే లైన్ కలుపుతుంది. దేశ అభివృద్ధికి ఇది బూస్ట్ లాగా ఉంటుంది. ఇది మేము కోరుకుంటున్నది. వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా ఇలాంటిది ఇవ్వడం గొప్ప విషయం. ఇలాంటి చర్యలు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అమరావతి.. త్వరలో హైదరాబాద్‌కి కనెక్ట్ అవుతుంది. విజయవాడకి కనెక్ట్ అవుతుంది. ప్రాచీన ఆలయాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే కీలక రేవులకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు. మీ పాలనా అనుభవంతో… ఈ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చారు. 2029లోపే దీన్ని పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాం” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు ఏపీలో 252.42 కోట్లతో రహదారి పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకూ 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ రాబోతోంది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇలా కేంద్ర ప్రభుత్వం.. కేబినెట్‌ సమావేశంలో ఏపీకి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి ద్వారా ఏపీలో అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

 

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!

 

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్‌.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్‌!

 

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples