Header Banner

ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!

  Fri Oct 25, 2024 17:07        Politics


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ ప్రకటించింది. 56 కిలోమీటర్లు ఉండే ఈ లైను నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని కేంద్రం చెబుతుండగా, మూడు సంవత్సరాల్లో పూర్తయ్యేలా చూడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను రిక్వెస్ట్ చేశారు. సాధ్యమైనంత వేగంగా పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ లైను గుంటూరు జిల్లాలోని నంబూరు దగ్గర కలుస్తుంది. మధ్యలో అతి పెద్ద రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో కొత్తగా తొమ్మిది రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేన‌ల్లుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

రానున్న రోజుల్లో అమరావతి రైల్వే లైనును మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నాగపూర్, కోల్ కతా నుంచి రైళ్లు వస్తుంటే అన్నిరకాలుగా అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైల్వే లైను పూర్తయిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్ కు, అమరావతి నుంచి చెన్నైకి, అమరావతి నుంచి విశాఖపట్నంకు, అమరావతి నుంచి బెంగళూరుకు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణం జరపనున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తికావొచ్చిందని, వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు. దక్షిణాదిలో నిర్మించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమరావతి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసేలా నిర్మించాలని ప్రధానమంత్రిని కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ గంటన్నరలోనే చేరుకోవచ్చన్నారు. దక్షిణ భారతదేశంలో అమరావతి రాకుండా ఏ రైలు ప్రయాణం కొనసాగించలేని విధంగా లాజిస్టిక్స్ హబ్ గా తయారుచేయబోతున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

 

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

 

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!

 

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్‌.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్‌!

 

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples