గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Mon Nov 11, 2024 07:00        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. జమిలి ఎన్నికల ప్రచారం వేళ ప్రభుత్వం సంక్షేమ పథకాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ బడ్జెట్ లోనూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. అదే సమయంలో మహిళల పథకాల పైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్దిక మంత్రి పయ్యావుల రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.

 

ఇంకా చదవండి: ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!

 

వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బడ్జెట్ తో పాటుగా అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ సమావేశాలకు ముందు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది. ఈ బడ్జెట్ లో ఈ సారి సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక, జనవరి నుంచి జన్మభూమి -2, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుతో పాటుగా ఇతర హామీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారని సమాచారం. సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఈ మేరకు నిధుల కేటాయిస్తూ ఈ పథకం అమలు పైనత స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. అదే విధంగా మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా బడ్జెట్ లో ప్రస్తావన చేయనున్నారు. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. నేటి సమావేశంలో రుణాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక, యువతకు ప్రతీ నెలా రూ 3వేల స్టైఫండ్ పైనా స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ నేతలు ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews