జమిలి వచ్చినా ఏపీలో 2029లోనే ఎన్నికలు! షెడ్యూల్ ప్రకారమే ప్రజాస్వామ్య పునాదులు – సీఎం చంద్రబాబు!

Header Banner

జమిలి వచ్చినా ఏపీలో 2029లోనే ఎన్నికలు! షెడ్యూల్ ప్రకారమే ప్రజాస్వామ్య పునాదులు – సీఎం చంద్రబాబు!

  Sat Nov 23, 2024 09:56        Politics

దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూలు ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయి.. ముందస్తు ఎన్నికలేవీ ఉండవు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తన కార్యాలయం వద్ద విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 'విజన్ డాక్యుమెంట్-2047 అమలుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. ఆ లక్ష్యాలను సాధించేందుకు నెలవారీ, త్రైమాసిక ప్రణాళికలు రూపొందించుకుని వాటిని పూర్తిచేసేలా కార్యాచరణను అమలు చేస్తాం. 'విజన్' లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్నపంథాను అమలు చేయబోతున్నాం' అని ఆయన తెలిపారు. సెకితో సౌరవిద్యుత్ ఒప్పందాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్కు అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదవడం, ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడనుండటంతో ఆ ఒప్పందాలను పునఃసమీక్షిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా 'ఈ వ్యవహారంపై సమగ్ర సమాచారాన్ని తీసుకుంటున్నాం.


ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?



కేసును రాష్ట్ర పరిధిలో విచారించేందుకు అవకాశం ఉందా అన్న అంశంపైనా న్యాయనిపుణులతో సంప్రదించాల్సి ఉంది. ఒప్పందాల రద్దు అంశానికొస్తే.. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా, మరోవైపు ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మేం అదే చేస్తున్నాం. ఊరికనే ఏదో ఒకటి వ్యాఖ్యానం చేసేయలేం కదా' అని చంద్రబాబు వివరించారు.
బోస్టన్ గ్రూప్ ఆధ్వర్యంలో.. స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం
ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే 'స్వర్ణాంధ్ర-2047' బాధ్యతలను ప్రభుత్వం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)నకు అప్పగించింది. దార్శనిక పత్రం తయారీ తర్వాత 12 నెలల పాటు కార్యక్రమ అమలుకు సంస్థ సహకారం అందిస్తుంది. దీనికి రూ.3.54 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్కుమార్ శుక్రవారం పరిపాలన అనుమతులిచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #elections #preelections #jamili #APCM #CBN #declaration #todaynews #flashnews #latestupdate