మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

Header Banner

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

  Sat Nov 23, 2024 10:52        Politics

మూడేళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, ఇందుకోసం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర -2047 పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 'అమరావతి రాజధానిలో టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలిచాం. డిసెంబరు 15 నుంచి పనులు ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యే క్వార్టర్లు ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేలందరికీ ఇక్కడే క్వార్టర్లు ఇస్తున్నాం. అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అన్ని నివాసాలు, కార్యాలయాలు, రహదారులు, ప్లాట్లు అభివృద్ధి చేసి.. మూడేళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తాం' అని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కోరగా.. పారదర్శకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరులోగా పూర్తి చేసి, జాతికి అంకితం ఇస్తామని సీఎం చెప్పారు. ‘ఈ ప్రాజెక్టుకు కేంద్రం 12,157 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.55,549 కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికి రూ.11,762 కోట్లు ఖర్చు పెట్టాం. డయాఫ్రం వాల్ను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తాం' అని వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #amaravathi #rakadhani #developmnet #CM #APCM #CBN #chiefminister #todaynews #flashnews #latestupdate