హత్య, ఆయుధ తస్కరణలో నంద్యాల వైకాపా నేత కీలక పాత్ర! భారీ ఆయుధాలు స్వాధీనం!

Header Banner

హత్య, ఆయుధ తస్కరణలో నంద్యాల వైకాపా నేత కీలక పాత్ర! భారీ ఆయుధాలు స్వాధీనం!

  Sat Nov 23, 2024 14:58        Politics

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంతోపాటు ఏపీలో జనశక్తి పార్టీని పునర్నిర్మించే ప్రణాళికతో ఆయుధాలు తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీని వెనుక ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు కీలక సూత్రధారిగా ఉన్నట్లు తేల్చారు. నిందితుల నుంచి 4 రివాల్వర్లు, 8 మ్యాగజైన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు, 6 సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించి ఆదిలాబాద్ గ్రామీణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామానికి చెందిన వొట్టి వెంకట్రెడ్డి(ఏ-1) గతంలో జనశక్తి పార్టీలో పని చేసి అరెస్టయ్యాడు. ప్రస్తుతం వైకాపా సానుభూతిపరుడిగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో తన మిత్రుడు ఎల్లయ్య హత్యకు గురయ్యాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిపై పగ పెంచుకొని మట్టుబెట్టాలనుకున్నాడు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా జనశక్తి పార్టీని పునర్నిర్మించాలని ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా తన అనుచరుడు నంద్యాల జిల్లాకు చెందిన ఆవులపాటి హిమకాంత్రెడ్డి(ఏ-3) రెస్టారెంట్లో వంటమనిషిగా పని చేసే బిహార్కు చెందిన భైరవ సహాయంతో ఆయుధాలు విక్రయించే వ్యక్తిని సంప్రదించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



అనంతరం హిమకాంత్రెడ్డి, నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన మైల దిలీప్ (ఏ-2)లు బిహార్లోని ముంగర్ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేశారు. అనంతరం వాటిని కారులో పెట్టుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) బైపాస్ రోడ్డు వద్ద పక్కా సమాచారంతో ఆదిలాబాద్ గ్రామీణ ఎస్సై ముజాహిద్ తన సిబ్బందితో కలిసి వాహనాన్ని పట్టుకొని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హిమకాంత్రెడ్డి, దిలీప్లను అదుపులోకి తీసుకొన్నారు. వారిచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందం పోలీసులు వెంకట్రెడ్డితోపాటు ఆయుధాల కొనుగోలుకు ఆర్థికసాయం చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన నల్లగంటి ప్రసన్నరాజు (ఏ-4)లను కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం నలుగురినీ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరెడ్డిపై ఇది వరకే మూడు హత్యలు, ఒక హత్యాయత్నం, నాలుగు జనశక్తికి సంబంధించిన కేసులు ఉన్నాయి. బిహార్ తోపాటు తెలంగాణ, ఏపీల్లో అతనికి సహకరించిన మిగతా నిందితులను అరెస్టు చేయటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఆయన అభినందించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #ykapa #weapons #smuggling #trasport #nadhyala #todaynews #flashnews #latestupdate