ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

Header Banner

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

  Fri Dec 13, 2024 07:00        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. రాష్టంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు. అలాగే అనర్హులకు పెన్షన్లలో కోత విధించే విషయంలో మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్రస్ధాయిలో చర్యలు మొదలుకాబోతున్నాయి. ఇవాళ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు పెన్షన్లపై స్పందించారు. రాష్ట్రంలో వివిధ సామాజిక ఫించన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సాంకేతిక, హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్‌తో అనర్హులను తొలగించాలని సూచించారు. ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.సర్టిఫికెట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు.

 

ఇంకా చదవండి: దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ! ప్రేమా.? తెగింపా.? తెర వెనుక..

 

ఎక్కడైనా సదరం సర్టిఫికెట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రతి నెలా సుమారు 64 లక్షల సామాజిక ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఒక గ్రామంలోని ఫించన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారని గుర్తుచేశారు. అనర్హులు ఫించన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో 26 జిల్లాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామ, ఒక వార్డు సచివాలయంలో ఈ నెల 9,10 తేదీల్లో ఒక పైలెట్ సర్వే నిర్వహించారని వెల్లడించారు. సర్వేలో మొత్తం 10,958 ఫించన్లు తనిఖీ చేయగా వాటిలో 10,020 ఫించన్లు సక్రమంగా ఉండగా 563 అనర్హంగా ఉన్నట్టు గుర్తించామని శశిభూషణ్ తెలిపారు. అనర్హత గల ఫించన్లలో అధికంగా దివ్యాంగ ఫించన్లు ఉన్నట్టు తేలిందన్నారు.

ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో షాక్‌! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను!

 

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews