ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  Sun Dec 15, 2024 20:32        Politics

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో పలు కీలక ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సర్కారుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోంది. ఈ క్రమంలోనే పలు రైల్వే, రోడ్ ప్రాజెక్టులపై ముందడుగు పడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరో రెండు రహదారుల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గుంటూరు జిల్లాలో కీలక రహదారులుగా ఉన్న తెనాలి- నారా కోడూరు, తెనాలి - మంగళగిరి రహదారులను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెనాలి- నారా కోడూరు, తెనాలి - మంగళగిరి రహదారులను నాలుగు వరుసలకు విస్తరిస్తారు.

 

ఇంకా చదవండి: 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

రహదారి విస్తరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు ఖరారైన వెంటనే డీపీఆర్ నివేదిక తయారీ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక తయారు చేస్తారు. రహదారి విస్తరణ కోసం ఎంత భూమి అవసరం అవుతుంది.. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా.. భూసేకరణ చేయాల్సి వస్తే ఎంత భూమిని సేకరించాలి.. కల్వర్టులు, వంతెనలు ఎక్కడైనా నిర్మించాలా ఇలాంటి విషయాలను డీపీఅర్‍లో నివేదిస్తారు. ఆ తర్వాతే రోడ్డు విస్తరణకు అయ్యే ఖర్చుపై ఓ క్లారిటీ వస్తుంది. డీపీఆర్ రూపకల్పన తర్నాత నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. తెనాలి - నారా కోడూరు రోడ్డు విషయానికి వస్తే.. ఈ రహదారి 17 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారి గుండా రోజుకు 34 ఆర్టీసీ బస్సులు 238 ట్రిప్పులు నడుస్తుంటాయి. బస్సుల్లోనే రోజూ 20 వేల మంది ప్రయాణిస్తుంటారని అంచనా. బస్సులు కాక వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగించేవారు.. మరో 55 వేల మంది వరకూ ఉంటారు. మొత్తంగా రోజుకు 75 వేల మంది ప్రయాణిస్తుంటారని అంచనా.

 

ఇంకా చదవండి: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! వారికి నామినేటెడ్ పదవులు కూడా కష్టమే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews