ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

Header Banner

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

  Mon Dec 16, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది కూటమి సర్కార్. పట్టణాల్లో గరిష్ఠంగా 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. పేదలకు ఈ ఇంటి స్థలాల పంపిణీని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

 

గత ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంట్ల స్థలాలు మాత్రమే కేటాయించారు. ఈ నిర్ణయంపై భూమి పరిమితి కారణంగా భవనాలు నిర్మించలేమనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు, స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని ఫిర్యాదులు రావడంతో పేదలలో అసంతృప్తి నెలకొంది. కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినా, స్థలాలు చూపించలేదని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బహిరంగంగానే వచ్చాయి. ప్రైవేటు భూముల కొనుగోలులోనూ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జిల్లాలవారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కూటమి సర్కార్ సేకరిస్తున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఎవరెవరికి భూములు ఇచ్చారు? ఎంతమంది ఇప్పటికీ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు? దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలు ఏమిటి? వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. తక్కువ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో జి+3 టిడ్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభానికి ముందే ఇళ్ల స్థలాల పంపిణీ విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తృత చర్చ జరిగింది. పేదల కోసం స్థలాల పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో వచ్చిన అవకతవకలను అధిగమించి ఈ సారి ప్రతి లబ్ధిదారుకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం, ఈసారి మరింత పారదర్శకంగా, సమర్థంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకువస్తుందనే దానిపై ప్రభుత్వం ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

 

ఇంకా చదవండి: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! వారికి నామినేటెడ్ పదవులు కూడా కష్టమే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?

 

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews