ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

Header Banner

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

  Tue Dec 17, 2024 07:00        Politics

టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండేది. అయితే ఆ సమయంలో పలు పథకాలకు సీఎంగా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ వాటిలో కొన్నింటిని రద్దు చేసింది. మరలా 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మరలా వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకురావడానికి ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం గురించి అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఈ కిట్లను అందజేసేవారు.

 

ఇంకా చదవండి: ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది! రాష్ట్రానికి చేసిన ద్రోహం క్షమించేది లేదు!

 

బేబీ కిట్‌లో చిన్న పరుపు, దోమతెర గొడుగు, లిక్విడ్ సబ్బు, న్యాప్‌కిన్లు, బేబీ సబ్బు వంటి అవసరమైన వస్తువులను అందించేవారు. ఇప్పుడు, ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల సంక్షేమం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2014-2019 మధ్య ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన అనుభవంతో, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు, శిశు మరణాల రేటు తగ్గించేందుకు బేబీ కిట్ల పంపిణీ పునఃప్రారంభానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలవారీ ప్రసవాల సంఖ్య, తద్వారా పథకాన్ని అందించే అర్హుల వివరాలను అధికారుల నుంచి సేకరిస్తున్నారు. ఈ కిట్లను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకే అందించనున్నారు.

 

ఇంకా చదవండి: పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!

 

అలాగే, బేబీ కిట్‌లో కొత్తగా మరిన్ని వస్తువులు చేర్చేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ కిట్‌లో దాదాపు రూ. 1,000 విలువైన వస్తువులు ఉంటాయి. బేబీ బెడ్ కమ్ క్యారియర్, దోమతెర గొడుగు, శానిటైజర్, పౌడర్లు, బేబీ క్రీములు వంటి వస్తువులు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ కిట్‌ను బయట కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం బల్క్‌గా కొనుగోలు చేస్తూ, ఉచితంగా అందజేస్తోంది. ఈ పథకం పునరుద్ధరణకు సంబంధించి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖల నుంచి పూర్తి సమాచారం సేకరించారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.

 

ఇంకా చదవండి: ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

 

అలాగే, గతంలో రేషన్ కార్డుదారుల కోసం ఇచ్చిన ఆర్థిక సహాయం, ఇతర సవాళ్లపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో ఇదే తరహా పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. ఆ అనుభవాలను అధ్యయనం చేసిన అనంతరం ఏపీలోనూ ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నారు. పేద గర్భిణులకు ఇది పెద్ద మేలు చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల, మంత్రి చెప్పిన ప్రకారం, కిట్ల పంపిణీపై త్వరలో పూర్తి స్థాయి ప్రకటన వెలువడనుంది. ఈ పథకంతో పేద మహిళల ఆరోగ్యం, నవజాత శిశువుల సంరక్షణలో ప్రభుత్వం మరింత ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాం.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

 

నేడు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

 

ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?

 

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews