ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

Header Banner

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

  Wed Dec 18, 2024 11:37        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త పెన్షన్ల పైన కసరత్తు ప్రారంభం వేళ బోగస్ పెన్షన్ లబ్దిదారులను తప్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే నకిలీ పెన్షన్ దారుల ను గుర్తించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీలు చేసారు. కొన్ని జిల్లాల్లో అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో, తాజాగా సెర్ప్ నుంచి జిల్లా కు దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. ఆ తరువాత ప్రభుత్వ జోక్యంతో వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కోత విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా మూడున్నర లక్షల మంది పెన్షనర్లకు నోటీసులు జారీ చేస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో క్షేత్ర స్థాయిలో పెన్షన్ల తనిఖీ చేపట్టారు. 26 సచివాలయాల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో పలువురు అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు.

 

ఇంకా చదవండి: ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

 

వీరికి నోటీసులు జారీ చేయాలని, సరైన సమాధానం చెప్పకపోతే ఆయా లబ్ధిదారుల పింఛన్‌ను హోల్డ్‌ లో పెట్టాలంటూ సెర్ప్ నుంచి అన్ని జిల్లాల అధికారులకు సర్క్కులర్ జారీ అయింది. అయితే, ఈ సర్క్యులర్ గురించి సంబంధిత మంత్రి.. ప్రభుత్వానికి సమాచారం లేదని చెబుతు న్నారు. దీంతో, ప్రభుత్వం ఈ విషయం పైన ఆరా తీయటంతో పాటుగా సర్క్యులర్ నిలిపి వేయాలని ఆదేశించింది. పూర్తి స్థాయిలో కసరత్తు తరువాతనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చేసిన క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత రాష్ట్రంలోని 15,004 సచివాలయాల పరిధిలో 3 నుండి 3.50 లక్షల మంది పింఛన్లపై వేటు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెన్షన్లు పొందుతున్న వారి నుంచి వారు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లు, నాలుగు చక్రాల వాహనా లు, ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు, భూముల విస్తీర్ణం తదితర అంశాలను ప్రశ్నలలో ప్రభుత్వం వారి నుంచి సమాచారం సేకరించింది. వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగా అర్హతను ఖరారు చేయనుంది. అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తోంది. ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే పింఛన్ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ల పెన్షన్ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. లబ్ది దారులు ళ అర్హతను నిరూపించుకోకపోతే వాళ్ల పింఛన్ కట్ అవుతుంది.


ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..

 

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

 

4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #Chandrababu #ChandrababuNews #Pensions #NewUpDate #APpeoples