త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

Header Banner

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

  Thu Dec 19, 2024 07:00        Politics

ఏపీలో వైసీపీ కాళీ అవడం ఖాయం. ఆపార్టీలో ఉండేందుకు లేదా ఆపార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు కూడా ఎవరూ మిగలరని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాదు టీడీపీ డోర్లు ఓపెన్ చేస్తే చాలు.. వైసీపీలో ఏ ఒక్కరు మిగలరని ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది నేతలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే త్వరగా ఎన్నికలు వస్తాయని వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి భ్రమపడుతున్నారని.. ఒకవేళ ఎన్నికలు ముందుగా వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం గెలవడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి జోస్యం చెప్పారు.

 

ఇంకా చదవండి: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

365 రోజులు ప్రజల మధ్యే ఉండే వ్యక్తి చంద్రబాబునాయుడు అని చెప్పిన మంత్రి జగన్ ప్రజాపోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కనుమరుగైపోతుందా.. ప్రస్తుతం ఆపార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు వైసీపీలో కొనసాగడానికి ఇష్టపడటం లేదా.. అతి త్వరలోనే అందరూ టీడీపీలో చేరేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్‌కి టచ్ లో ఉన్నారని ఏపీకి చెందిన మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పొలిటికల్ బాంబ్ పేల్చారు. టీడీపీ ఎప్పుడు తలుపులు తెరిస్తే అప్పుడు చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలంతా రెడీగా ఉన్నారంటూ సంచలన కామెంట్ చేశారు. మంత్రి కామెంట్స్ చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో వైసీపీలో ఉన్న అందర్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని ఇట్టే అర్దమవుతోంది.

 

ఇంకా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ పాలన కొనసాగిస్తోంది. మరోవైపు వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను కూడా వెలికితీస్తోంది. ఈభయంతోనే ఆపార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారని గత కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఆళ్లనాని కూడా టీడీపీకి దగ్గరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులు చూసి జగన్‌కి కూడా ఇది ప్రజారంజకపాలన అని అర్థమైందని మంత్రి తెలిపారు. ఇక జమిలి ఎన్నికల బిల్లు పాసైతే ఎన్నికలు ముందొస్తాయని..అప్పుడు వైసీపీ గెలుస్తుందని జగన్, విజయసాయిరెడ్డి పగటి కలలు కంటున్నారని చెప్పారు.

 

ఇంకా చదవండి: అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

జమిలీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి భయపడటం లేదన్న మంత్రి..ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగినా వైసిపి నుంచి పోటీ చేసే వారే ఉండరని సెటైర్ వేశారు. జగన్ బి.ఫాంలు ఇస్తామని బతిమాలినా ఎవరూ తీసుకోరని చెప్పారు. మా సత్తా ఏంటో నీటి సంఘాల ఎన్నికల్లో చూపించామన్న మంత్రి త్వరలో ఉమ్మడి కడప జిల్లాలో వైసిపి ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నామని..ఏపీలో జరుగుతున్న అభివృద్దిని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నాయని మంత్రి తెలిపారు.వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో ఎన్.సి.సి.రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆనంతరం మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.


ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

 

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..

 

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

 

4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews