రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

Header Banner

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

  Fri Dec 20, 2024 09:00        Politics

రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ స్కీమ్ ప్రయోజనాలు పొందాలన్నా కచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా వరకు ప్రయోజనాలు పొందలేరు. రేషన్ కార్డు కలిగిన వారికి తక్కువ ధరకే రేషన్ సరుకులు లభిస్తాయి. ప్రభుత్వం రాయితీతో ఈ సరుకులు పంపిణీ చేస్తోంది. అందుకే తక్కువ ధరకే పొందొచ్చు. చక్కెర, కంది పప్పు, బియ్యం, జొన్నలు వంటి వాటిని తీసుకోవచ్చు. మరీముఖ్యంగా మార్కెట్‌లో కంది పప్పు, చక్కెర వంటి వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. కంది పప్పు రేటు బహిరంగ మార్కెట్‌లో కేజీకి రూ. 160 నుంచి రూ. 180 వరకు పలుకుతోంది. అయితే మీరు రేషన్ షాపుల్లో కంది పప్పును రూ. 67కే పొందొచ్చు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిలాల్లో ఎండీయూ ఆపరేటర్లు కూడా మోసాలకు తెరలేపారు. కంది పప్పును కొంత మందికే ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

కేవలం 30 నుంచి 40 శాతం మందికే ఇస్తున్నారు. గణంకాలు మాత్రం 90 శాతం మందికి ఇచ్చినట్లు ఉంటున్నాయి. ఇక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ కంది పప్పు మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం, చక్కెర ఇచ్చేటప్పుడే కంది పప్పు కూడా ఇచ్చినట్లు రేషన్ కార్డుదారుల నుంచి వేలి ముద్రలు వేయించుకుంటున్నారు. అయితే నిజానికి అక్కడ కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు రేటు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని.. అందరికీ ఇచ్చినట్లు చూపించి.. చాలా మందికి ఇవ్వడం లేదు. దీంతో నొక్కేసిన కంది పప్పును బయట మార్కెట్లో కేజీకి రూ. 130 చొప్పున అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రేషన్ కార్డు కలిగిన వారు ఇంకో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రేషన్ షాపులో రేషన్ తీసుకునే వారికి రశీదు వస్తుంది. దీన్ని తీసుకోవాలి. ఇ-పాస్ మిషన్‌లో బయోమెట్రిక్ వేసిన తర్వాత దీని నుంచి రశీదు వస్తుంది. ఈ రశీదులో ఏవేవి తీసుకున్నారనే సమాచారం ఉంటుంది. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఈ రశీదు పొందాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఏఏ సరుకులు తీసుకున్నారని. రశీదు లేకపోతే ఏం తీసుకున్నారో కూడా తెలియదు.

 

ఇంకా చదవండి: మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews