జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

Header Banner

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

  Mon Jan 20, 2025 07:00        Politics

ఆంధ్రప్రదేశ్‌ లో ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పోడుస్తున్నారంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కక్షపెట్టుకున్నారని, అందుకే రోజూ అసత్యాలతో బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన జగన్.. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల నుంచి సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఆ వ్యవస్థను సరిదిద్దారని చెప్పారు. ఇదే ఆయన అనుభవానికి నిదర్శమని గొట్టిపాటి చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేకపోవడం వల్లే జగన్ అసత్యాల ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ఈ పథకాల ప్రయోజనాలేంటో దీర్ఘకాలంలో ప్రజలు తెలుసుకుంటారని మంత్రి చెప్పారు. ఎలాంటి అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే ఈ పథకాల వల్ల నష్టమేంటో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలంటూ మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు.

 

ఇంకా చదవండి: ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎంలకు భూమి కేటాయించిన చంద్రబాబు! పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే!

 

సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంట్ మరింత మెరుగ్గా అందించవచ్చని ఆయన చెప్పారు. రైతులకు ఫీడర్ లెవల్‌లోనే నాణ్యమైన విద్యుత్‌ను జగన్ వద్దంటారా? అంటూ మంత్రి ప్రశ్నించారు. సూర్యఘర్ పథకం ద్వారా క్వాలిటీ గల విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని గొట్టిపాటి వెల్లడించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఈ పథకాలను ఎన్డీయే ప్రభుత్వం అందిపుచ్చుకోవటాన్ని చూసి ఆయన ఓర్వలేకపోతున్నారని మంత్రి నిప్పులు చెరిగారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం త్వరలో ఏపీ మెుత్తం అమలు చేస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సౌరవిద్యుత్ ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మంత్రి చెప్పారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకు జగన్ సైతం ముందే ఉంటారని గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఇద్దరి పాలన మధ్య తేడా ఏంటో ఏపీ ప్రజలకు బాగా తెలుసంటూ చురకలు అంటించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు ఒక్క అవకాశమని నమ్మి గెలిపిస్తే ఏపీని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బాధ్యతల స్వీకరణ తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటన! ఎప్పుడు? ఎందుకూ అంటే.!

 

ఓరి దేవుడా.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం! భక్తులు భయంతో ఉరుకులు పరుగులు!

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #hyderabad #Highcourt #JaganCase #AndhraPradesh #APpolitics