బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

Header Banner

బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

  Tue Jan 21, 2025 07:00        Politics

న్టీఆర్ భరోసా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి పెన్షన్ల పంపిణీపై కూడా నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హుల పింఛన్‌ల తొలగింపుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛన్ లబ్ధిదారుల పరిశీలన పూర్తిచేసి, ఇప్పుడు దివ్యాంగుల కేటగిరీలోని పింఛన్‌లపై తనిఖీలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో ఆలస్యం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ తనిఖీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అనర్హుల పింఛన్‌లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో అనర్హుల సంఖ్య అధికంగా ఉండడంతో, రాష్ట్రవ్యాప్తంగా వీరిపై ఆరా తీయాలని ప్రభుత్వం యోచించింది.

 

ఇంకా చదవండి: దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

అందులో భాగంగా వైద్య పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ అందుకుంటున్నవారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు సుమారు 200 మందికి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలకు ఎవరెప్పుడు హాజరుకావాలో ముందుగానే సమాచారం అందజేస్తారు. పరీక్షకు హాజరుకాకపోతే వారి పింఛన్ నిలిపివేయబడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తనిఖీల్లో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, ఆఫ్తమాలజిస్ట్ వంటి వైద్య నిపుణులతో పాటు నాలుగు సహాయక వైద్యులు కూడా పాల్గొంటారు. ఈ డాక్టర్ల నివేదికలపై ఆసుపత్రుల పర్యవేక్షకులు, ఆర్‌ఎంవోలు సంతకాలు చేస్తారు. ఈ నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటారు.

 

ఇంకా చదవండి: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

అనర్హుల పింఛన్‌ల తొలగింపు ద్వారా అర్హులైన వారందరికీ పింఛన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయం. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు కూడా పింఛన్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఈ తనిఖీల తర్వాత ర్యాండమ్ పునఃపరిశీలన చేపట్టేందుకు మరో బృందాన్ని నియమించనుంది. గుండె జబ్బులు, పక్షవాతం, డయాలసిస్, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు ₹15,000 పింఛన్ అందజేస్తున్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో అనర్హుల పేర్లతో పింఛన్‌లు మంజూరు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పునఃపరిశీలన జరుగుతోంది. అనర్హుల పింఛన్‌ల తొలగింపుపై కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేందుకు కట్టుబడి ఉంది. దీనితో పింఛన్ పథకాల ప్రభావాన్ని మెరుగుపరచడంతోపాటు ప్రజల నమ్మకాన్ని చాటిచెప్పే దిశగా అడుగులు వేస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బాధ్యతల స్వీకరణ తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటన! ఎప్పుడు? ఎందుకూ అంటే.!

 

ఓరి దేవుడా.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం! భక్తులు భయంతో ఉరుకులు పరుగులు!

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews