జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

Header Banner

జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

  Wed Jan 22, 2025 08:20        Politics

జనసేన పార్టీకి పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను చేరుస్తూ, గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఈసీ అధికారిక లేఖ ద్వారా వెల్లడించింది. 

 

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జనసేన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన చేసిన ట్వీట్‌లో, పార్టీ స్థాపన నుండి ఇప్పటివరకు ప్రజల కోసం చేసిన నిరంతర పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, గాజు గ్లాసు గుర్తు పార్టీకి శాశ్వత చిహ్నంగా రిజర్వ్ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. 

 

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయాలతో జనసేన రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నిలిచింది. జనసేన తన అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

"2014లో జనసేన పార్టీ స్థాపించి, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ ప్రస్థానం నేడు చరిత్రలో నిలిచిపోయింది. లక్షల మంది జనసైనికుల శ్రమ, అంకితభావానికి ఫలితంగా 100% విజయంతో చరిత్ర సృష్టించిన జనసేనకు గుర్తింపు రావడం అందరికి గర్వకారణం," అని ట్వీట్‌ జనసేన అధిష్ఠానం తెలిపింది.

 

కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకార.. అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసి, 6% ఓట్లు సాధించిన పార్టీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ప్రకటిస్తారు. వీటికి గుర్తు కేటాయించడంతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా అందిస్తారు. జనసేన ఇప్పుడు ఈ శ్రేణిలో చేరింది.

 

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందడంతో, జనసేన కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయనున్నారు. జనసేన గాజు గ్లాసు గుర్తుతో ప్రజాసేవలో ముందంజ వేస్తుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. జనసేన ఈ కొత్త అధ్యాయంలో తన ప్రభావాన్ని మరింత పెంచాలని సంకల్పిస్తోంది.

JSP Letter To EC.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP