యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!

Header Banner

యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!

  Mon Feb 12, 2024 20:20        Gulf News, U A E

యూఏఈ: అస్థిర వాతావరణం కారణంగా సోమవారం మరియు మంగళవారాల్లో దేశం నుండి బయలుదేరే ప్రయాణీకులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించినట్లు యూఏఈ విమానయాన సంస్థలు ఆదివారం తెలిపాయి. అయితే, ఎమిరేట్స్, ఎతిహాద్ మరియు ఫ్లై దుబాయ్ అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని, ప్రతికూల వాతావరణం వల్ల ప్రభావితం కాలేదని పేర్కొన్నాయి. “ఫిబ్రవరి 11 మరియు 12 తేదీల్లో దుబాయ్ లో భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసినందున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే విమానాశ్రయానికి ముందుగానే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ముందుగానే విమానాశ్రయానికి వచ్చి చెక్- ఇన్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకోవాలి. ”అని ఎమిరేట్స్ ప్రతినిధి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం విమానం బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలని, దుబాయ్ ఆధారిత క్యారియర్ ఫ్లై దుబాయ్ సూచించింది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates