గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!

Header Banner

గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!

  Mon Aug 12, 2024 17:46        Gulf News

Episode1: 

ఇటీవల గల్ఫ్ దేశాలలో సంపాదన బావుంటుందని ఆశపడి ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది సోషల్ మీడియాలో తమ గోడును వెళ్ళకకుతున్నారు. 

 

ఇలాంటివారిని కొంతమంది బాధలు ఏపీ మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళటం జరిగింది. వెంటనే వారు ఆ మెసేజ్ లకు స్పందించి వారిని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చి, NRI TDP Cell ద్వారా ఎంబసీ అధికారులతో చర్చలు జరిపి, వారిని సురక్షితంగా భారత దేశానికి కొంతమందిని తీసుకురావడం జరిగింది. 

 

కాగా, ఈ విధంగా ఇళ్లల్లో పని చేసేవారు ఆంధ్రప్రదేశ్ ను, దేశాన్ని వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రక్రియ మొత్తం మెయిడ్ మార్కెట్ గా పరిగణిస్తారు. అసలు ఈ మెయిడ్ మార్కెట్ అంటే ఏమిటి. ఇది ఎలా మొదలైంది. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏజెంట్లు పాత్ర ఏమిటి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి, ఇలా ఇరుక్కుపోయిన వారిని ఏ విధంగా తీసుకురావడానికి ఆస్కారం ఉంది, కొంతమంది సంవత్సరాల తరబడి ఆచూకీ తెలియకుండా ఉన్నవారు పరిస్థితి ఏంటి అనేటువంటి పలు అంశాలు చర్చిస్తూ పదిమందికి అవగాహన కలిగించాలని సదుద్దేశంతో గల్ఫ్ లో జరిగే రియల్ స్టోరీస్ ఆధారంగా "గల్ఫ్ మెయిడ్ మార్కెట్" అనే ధారావాహిక రూపంలో ఆంధ్రపవాసి వెబ్ సైటు లో అందించడం జరుగుతుంది. దీంట్లో వచ్చే కథనాలు అన్నీ కూడా వాస్తవంగా జరిగిన జరుగుతున్న విషయాలను పేర్లు మార్చి మీకు అందించడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా చదివి అక్కడ జరిగే వాస్తవాలను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి వారికి కూడా అవగాహన కలిగించే విధంగా సహకరించగలరని ఆశిస్తున్నాము.

ఇట్లు
మీ
చప్పిడి రాజశేఖర్ 

 

ఇంకా చదవండివిద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గల్ఫ్ లో మెయిడ్ మార్కెట్ వ్యాపారం కథా కమామీషు
గల్ఫ్ లో పనిమనుషుల కోసం జరుగుతున్న వ్యాపార లావాదేవీలు అదొక పెద్ద ప్రహసనం. అటు గల్ఫ్ కీ, ఇటు ఏజెన్సీలకి మధ్య ఒప్పందాలతో జరిగే ఈ ట్రేడింగ్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే కొన్ని నష్టాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితికి చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పటి మార్కెట్ వ్యవాహారానికి లాభమే ఎక్కువగా ఉందనడానికి సందేహం లేదు. అందుకనే అటు గల్ఫ్ ను, ఇటు స్వదేశాలలోనూ చాలా ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 

 

ఇంతకు ముందు పరిస్థితిని తీసుకుంటే స్వదేశాలనుండి గల్ఫ్ వెళ్ళడం అనేది కొంచెం కష్ట తరంగా ఉండేది అంటే టికెట్, వీసా, తదితర ఖర్చులన్నీ అక్కడికి వెళ్ళే వ్యక్తే భరించుకోవాల్సి వచ్చేది. ఏజెంట్ ద్వారా అయితే ఆ ఎజెంట్ కు ఇచ్చే ఖర్చులు కూడా కలుపుకొని మరీ, అప్పో సొప్పో చేసి గల్ఫ్ కు వెళ్ళవలసి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 

 

గల్ఫ్ కి ఎవరికన్నా పనిమనుషులు కావాలి అంటే వారు ఏజెన్సీలని కలిసి వారికి గల్ఫ్ లో ఇండియన్ రుపీస్ ప్రకారం 2 నుంచి 2.5 లక్షల దాకా చెల్లించి పనిమనుషులని రప్పించుకోవడం జరుగుతుంది. 2 నుంచి 2.5 లక్షల వరకు అంటే, ముందే చెప్పుకున్నాము ఇంతకుముందు గల్ఫ్ వచ్చేవాళ్ళ పైనే ఖర్చులు అని, కాని ఇప్పుడు వీరు సదరు పని మనిషి రావడానికి ఆ గల్ఫ్ లే చెల్లిస్తారు ఎజెంట్ ఖర్చులతో సహా సదరు వ్యక్తి ఏ మారుమూల గ్రామం నుండి వస్తున్నా అందుకు అయ్యే ప్రతీ ఖర్చూ వీళ్ళే పెట్టుకుని గల్ఫ్ కి రప్పించుకుంటారు. ఆఖరికి ఇటు ఇండియాలో ఉన్న ఏజెన్సీ, పాస్ పోర్ట్, వీసా ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తారు. 

 

అలా వచ్చిన పనిమనుషులను నియమించుకునే యజమానులకు ఏజెన్సీ వారు 3 నెలల గ్యారంటీ ఇవ్వాలి. అనగా పనిమనుషులు మెడికల్ టెస్ట్ లలో ఫెయిల్ ఐన, రెసిడెన్సీ పర్మిషన్ రాకపోయిన మొదలగు ఇబ్బందులు ఎదురయినప్పుడు వాటికి అగు ఖర్చులను ఏజెంటే భరించాలి, ఒకవేళ వచ్చిన పనిమనిషికి 3 నెలల లోపు అక్కడ నివసించడానికి కావాల్సిన అన్నీ అనుమతులు లభించక పోయినట్టైతే, ఆ పనిమనిషిని నియమించుకున్న యజమాని ఇంట్లో పని చేయడానికి, ఏజెన్సీ వారు వేరొక పనిమనిషిని పంపించాల్సి ఉంటుంది. 

 

అయితే ఇక్కడ కొన్ని పనులు అంటే డాక్యుమెంట్ అటెస్టేషన్ వగైరా పనులన్ని ఈ ఎజెంట్లే మధ్యవర్తుల ద్వారా చేయించేసి, వీరిని గల్ఫ్ పంపిస్తారు. ఇలా చేయడం వల్ల ఇమ్మిగ్రేషన్, రిజిస్ట్రేషన్ వంటివి కొంత ఇబ్బంది పెడతాయి కాబట్టి, ఇలాంటి డాక్యుమెంటేషన్లన్ని ఎంబసీ కార్యాలయాల ద్వారా పంపిస్తే చట్టపరమయిన ఇబ్బందులనేవి రావని మా సూచన. 

 

పని మనుషులు అక్కడికి వెళ్లాక యాజమాన్యంతో ఎలా ఉండాలి ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పాలి అనే విషయాన్ని తర్వాతి భాగంలో తెలుసుకుందాం..

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar