3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి!
Thu Aug 29, 2024 21:54 Gulf Newsఎంబసీ ద్వారా సక్రమమైన పద్ధతిలో వెళితే – ప్రయోజనాలు:
గత భాగంలో యాజమానితో ఎలా ఉండాలి ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి? ఎవరిని కలవాలి అనేది మనం తెలుసుకున్నాం... ఈ మధ్య కాలంలో ఎంతోమంది సరైన పద్ధతిలో కాకుండా ఏజెంట్లు చెప్పినట్టు విని తప్పుడు దారిలో వెళ్ళి అక్కడ వారి చేతుల్లో మోసపోయి నానా ఇబ్బందులు పడుతూ ఆ బాధ ఎవరికి చెప్పాలో తెలియక సోషల్ మీడియా లో చెప్పుకుంటున్నారు. ఈ ఘటనలపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. అక్కడ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపి వారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు సక్రమమైన మార్గంలో ప్రభుత్వం పెట్టిన నియమనిబంధనలు అనుసరించి వెళితే మనకి ఎంత సౌకర్యంగా, భద్రతగా ఉంటుందో తెలుసుకుందాం…
ఒక ఆలోచన, ఆచరణ, ఒక పద్ధతి లాంటివి అనుసరిస్తే, మనిషి ఉన్నత శిఖరాలని అధిగమించవచ్చు. డబ్బు సంపాదించాలి అన్న ఒకే ఒక ధ్యేయంతో తక్కువ కష్టం ఎక్కువ డబ్బు అన్న ఆత్రంతో ‘దూరపు కొండలు నునుపు’ అన్నట్లు విదేశాలకి పరుగులెడుతుంటూ ఉంటారు. గల్ఫ్ లో జరిగే మెయిడ్ మార్కెట్ ప్రహసనం ఇదే. అరబ్ యాజమానులు ఏజెంట్లను నియమించుకుని మొత్తంగా డబ్బు ఇచ్చేసి పనిమనుషులని రాబడతారు. ఇక్కడ ఇటు ఏజెంట్లు అటు పనివాళ్ళు ఈ క్రమంలో డబ్బు ఏవిధంగా సంపాదించాలో అన్ని మార్గాలు తెలుసుకుని అలా రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగమే ఈ సర్టిఫికేట్స్ అటెస్టేషన్.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
మధ్యవర్తుల ద్వారా ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయించేసుకుని, వారికి డబ్బు సమర్పిస్తూ ఉంటారు. దీనినే ఇల్లీగల్ ప్రాసెస్ అంటారు. అలా కాకుండా న్యాయమైన పద్ధతుల్లో ఈ వ్యవహారమంతా ఏంబసీ ద్వారా చేయిస్తే ఏంబసీ అనేక సౌకర్యాలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి పనులు సక్రమంగా కావాలి సులువైన మార్గంలో వెళ్ళాలి అంటే అంటే ఏంబసీ కార్యాలయమే మంచిది. ఇక ఎంబసీ ద్వారా వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఈ పనిమనుషుల గురించి అని అనుకున్నప్పుడు సర్టిఫికేట్స్ అటెస్టేషన్, రెజిస్ట్రేషన్ అన్నవి ఏంబసీ ద్వారా చేయించుకోడం వల్ల ఇమిగ్రేషన్ తొందరగా అయిపోతాయి. అదీకాక ఇలా చేయించుకున్న వ్యక్తులకి ఎంబసీ రక్షణగా ఉంటుంది.
రక్షణ:
ఇప్పుడు ఒక అమ్మాయి ఏజెన్సీ వారు పంపించే ఇల్లీగల్ దారిలో గల్ఫ్ లో పని చేయడానికి వచ్చింది అనుకుందాము. ఈ అమ్మాయి ఏజెన్సీ ద్వారా కాకుండా ఏంబసీ ద్వారా సరైన పద్ధతిలో, ఇమ్మిగ్రేషన్ పాస్ అయి గల్ఫ్ లో అడుగుపెట్టింది. ఇక్కడ ఏజెంట్ల ద్వారా గల్ఫ్ ల ఇళ్ళకి పనికోసం వెళ్ళి, అక్కడ ఆ వాతావరణం నచ్చకపోయినా లేదా అరబ్ యాజమానులు ఏమన్నా హింసాత్మక చర్యలు చేపట్టినా… ఈమే ఏజెంట్ దగ్గరికి తిరిగి వచ్చేయచ్చు లేదా ఎంబసీకి వచ్చి తన గోడుని తెలియజేసుకుంటే, ఏంబసీ ద్వారా సరైన దారిలో వెళ్ళింది కాబట్టి ఆమె వివరాలు ఎంబసీలో భధ్రంగా ఉంటాయి కాబట్టి, ఆమె ఇష్ట ప్రకారం ఆమెని అక్కడ ఏజెన్సీల సహాయంతో వేరే చోటికో, లేదా స్వదేదాశానికో సత్వరం పంపే ఏర్పాట్లు చేస్తారు ఎంబసీ కార్యాలయం వాళ్ళు. అదే మధ్యవర్తుల ద్వారా వెళ్ళడంతో వచ్చిన చిక్కల్లా ఎక్కడ ఎవరి ద్వారా గల్ఫ్ వెళ్లారో వారి దగ్గరనుండి ఒక లెటర్, అది వచ్చాక ఇక్కడ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని, అవి అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో వెరిఫికేషన్, ఇదంతా ఒక పెద్ద ప్రహసనం. అందుకే కొంచం ఆలస్యమయినా ఎంబసీ ద్వారా వెళితే, ఆపదలో ఉన్నప్పుడో, ఆకస్మిక మరణం సంభవించినపుడో ఎంబసీ ద్వారా సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం! ఆ 4 రాష్ట్రాల వారికి ఇక పండగే! ముఖ్యంగా మన ఏపీకి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక ఇన్స్యూరెన్స్: ఎంబసీ ద్వారా కాక మధ్యవర్తుల ద్వారా వెళ్ళిన వారికి ఏంబసీ లో వారి వివరాలు మొత్తంగా అందుబాటులో ఉండే అవకాశం ఉండదు కాబట్టి, వారు అక్కడ పని చేసుకుని మౌనంగా ఏ కష్టం వచ్చినా లేక ఏవిధమయిన అకాల మరణం సంభవించినా లాభపడేది ఏమి ఉండదు. అదే ఎంబసీ ద్వారా వెళితే సదరు వ్యక్తి అకాల మరణం సంభవించినప్పుడు, వారి వద్ద వివరాల ప్రకారం వారి బంధువుల దగ్గరికి మృతదేహం పంపడం జరుగుతుంది, అలాగే వారికి ఉన్నా భీమా సదుపాయం ద్వారా ఆర్థిక సహాయం కూడ చేయడం జరుగుతుంది.
అన్నీ సక్రమంగా జరిగినా ఇక్కడికి వచ్చి ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆత్రమో మరి, కొత్త దేశం, కొత్త ఆలోచనలు అనుకుంటూ తప్పటడుగు వేయడమో కాని, కొంతమంది ఇక్కడ అడ్డదారులు తొక్కుతూ భారత దేశ సంస్కృతిని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. ఆ వివరాలు తరువాయి భాగంలో….
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.