4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై!

Header Banner

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై!

  Mon Sep 02, 2024 17:30        Gulf News

గత భాగంలో ఎంబసీ ద్వారా సక్రమమైన మార్గంలో ఎలా వెళ్లాలో అలా వెళ్తే రక్షణ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. ఈ భాగంలో, ఒకటి అనుకోని గల్ఫ్ కు వెళితే అక్కడికి వెళ్ళాక జరిగేది మరొకటి. అదేంటో తెలుసుకుందాం... 

 

సంపాదించాలి, అతి కొద్ది సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించేయాలి, పరిస్థితి ఏదన్నా కావచ్చు కాని కష్టపడాలి అన్న ఆలోచనతో, సంపాదనా మార్గాలు ఎలా ఉంటాయి అన్నది పరిశోధించకుండానే, ఎంతోమంది సంపాదించాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో దేశం బోర్డర్ దాటేస్తూ ఉంటారు. దూరపు కొండలు నునుపు, సంపన్న దేశాలు అనే ఒకే ఒక్క మత్తు ఆవహించుకుని అక్కడికి అడుగిడిన దిగువ మధ్యతరగతి కుటుంబీకులకి అదంతా ఒక ఊహాలోకంలా అనిపిస్తూ ఉంటుంది. 

 

ఇంకా చదవండినెల్లూరు జిల్లాలో జగన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ! ఫోర్జరీ స్కాం నిందితులపై ఉక్కుపాదం! 

 

వాస్తవానికి వచ్చేసరికి కొండలెంత గరుకో తెలుసుకునే సరికి పరిస్థితి చేజారిపోతుంది. భారతీయ సాంప్రదాయం, భారత సంస్కృతి ఎందరో విదేశీయులని ఆకట్టుకుని, వారు పాటించేవిధంగా ఉంటాయి, అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడే వదిలేసి, సంపన్న దేశాలలో విచ్చల విడితనానికి అలవడి, భారత దేశ పరువుని, సాంప్రదాయాన్ని పెకిలిలించాలని చూస్తున్న దుష్టులకి అవకాశం ఇస్తున్నారు కొంతమంది అవకాశ వాదులు. పరిస్థితి అంతా చేజారాక ఎంబసీకి వస్తే అక్కడ వారేమో ఏమి చేయాలో తోచక, మన భారతదేశ పరువుని మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నామని వాపోయిన ఘటనలు ఎన్నో, ఎన్నెన్నో. 

 

ఇక్కడ తరచుగా జరిగే కొన్ని వాస్తవాల ఆధారంగా కొంతమంది అభాగ్యులు ఎలా జీవితాలు కోల్పోతున్నారో తెలుసుకుందాం. (పేర్లు మరియు జరిగిన సంఘటనల్ని మార్చడం జరిగింది) కోమలి పేరుకి తగ్గట్టు కోమలంగా ఉంటుంది. ఏజెంట్ల ద్వారా తన దిగువ మధ్య తరగతి జీవితము నుండి అమాంతం సంపన్నుల అంతస్థుకి చేరిపోవాలన్న ఆశతో, కలలతో గల్ఫ్ చేరుకుంది. ఏజెంట్ల ద్వారా గల్ఫ్ ఇంట్లో పని అమ్మాయిగా చేరింది. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లుగా ఒకవేళ అక్కడ పని నచ్చకపోతే ఆ అమ్మాయి ఏజెంట్ దగ్గరికో, ఇటు ఎంబసీ దగ్గరకో తిరిగి వచ్చేసినట్లయితే, వారు ప్రత్యామ్నాయం చూస్తారు. 

 

ఇంకా చదవండివైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కాని ఇక్కడ జరిగిందమిటంటే అరబ్బులు ఆమెని శారీరకంగా చిత్ర హింసలు పెట్టడం, కనీసం ఇంట్లో నుండి చెత్తని కూడా బయట వేయనివ్వక పోవడం మూలంగా ఆమె పారిపోయే అవకాశం లేకపోవడం, ఇలా కట్టు దిట్టమైన ఏర్పాట్లలలో ఆమె వంటి మీద వాతలతో రోజూ నరకం అనుభవించేది. ఒకరోజు ఏమరుపాటుగా వీధి తలుపు తెరిచి ఆ యజమానురాలు నిద్ర పోతూ ఉండడంతో అమాంతం బయటకి వచ్చేసి, ఎటు పారిపోవాలో తెలియని పరిస్థితిల్లో… రెండు రోజులు ఫ్లాట్ ఫార్మ్ మీద, పార్కులలో, అక్కడా, ఇక్కడా గడిపింది కోమలి. అసలే అందం, ఆపై ఒంటరిది ఇక ఏ దేశంలో ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది. అదే జరిగింది కోమలి విషయంలో రాత్రికి రాత్రి ఒక షేక్ కంట్లో పడటం, అతను ఆమెను వ్యభిచారం వృత్తిలో దింపటం ఆమెకు తెలియకుండానే జరిగిపోయాయి. ఆవిడ నిస్సహాయ పరిస్థితులు ఆమెని ఆ వృత్తికి బలవంతంగా తోసేసాయి. తినడానికి తిండి ఒక నివాసం, కాస్త డబ్బు ప్రస్థుతం ఆమె అంతకన్నా ఆలోచించే స్థితిలో లేదు. అలా ఆమె తన స్వదేశంలో కుటుంబాన్ని పోషించుకొంటూ ఎప్పుడు తన కుటుంబం దగ్గరకు వెళ్తానో అని దిగులుగా కాలం వెళ్లగొక్కుతుంది. 

 

అయితే ఇలా తప్పని పరిస్థితుల్లో మారే వారు కొందరయితే, ఇంకొందరు ఉంటారు, వీళ్ళు ఒక్క అరబ్బు ఇంట్లోనే పని అంటే గిట్టుబాటు కాదు అని ఏజెంట్స్ చూపిన ఇళ్ళకి కాక, తమకి తామే ఒక 10 మంది ఇళ్ళల్లో ఒక గంట, రెండు గంటలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటారు. ఇలా సక్రమంగా నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకుంటే పర్వాలేదు కాని, వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ఎవరికో ఒకరికి అన్నట్లుగా ఒకరి దగ్గర ఉండిపోవటం జరుగుతుంది. ఆ ఉంచుకున్న వాళ్ళు వాళ్ళకి జరిగినంత కాలం జరుపుకుని వదిలేయడం వల్ల వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది పనివాళ్ళుగా వెళ్ళి, పని బద్ధకం పెరిగి, ఇలా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇలాంటి వాళ్ళందరు తమకి అన్యాయం జరిగినప్పుడు ఎంబసీ వద్దకు పరుగులెట్టి, తమని తమ దేశం పంపమని అర్థించడం జరుగుతుంది. అలా గచ్చంతరం లేని పరిస్థితులు, నియంత్రించలేని కారణాలు, భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతున్న ఆ చర్యలు ఇటు అధికారులకి చెప్పలేక సతమతమవుతూ ఉంటారు ఏంబసీ అధికారులు. 

 

‘మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందాన ఇలాంటి కథలు ఎన్నో ఈ మెయిడ్ మార్కెట్ చరిత్రలో ఉంటాయి ఈ వ్యాపార లావాదేవీలు. అక్కడికి వెళ్లాక కొంతమంది జీవితం సక్రమమైన మార్గంలో ఐశ్వర్య వంతులుగా ఎలా మారతారో మరో భాగంలో తెలుసుకుందాము.

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar