గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!

Header Banner

గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!

  Wed Sep 04, 2024 18:52        Gulf News

మేడ్ మార్కెట్ Episode 5: 
గత భాగంలో మనం ఏదో సంపాదిద్దాం అని గల్ఫ్ దేశాలకు వెళితే... కానీ అక్కడ పరిస్థితులు వారికి ఎలాంటి కష్టాన్ని తెప్పిస్తాయో చదివాం... ఇప్పుడు అక్కడికి వెళ్లాక కొంతమంది ఐశ్వర్యవంతులు ఎలా అయ్యారో తెలుసుకుందాం... 

 

 

ఎవరయినా ఏ ప్రలోభాలకయినా లొంగుతున్నారు అంటే ముఖ్య కారణం డబ్బు, డబ్బుకి లోకం దాసోహం అన్న నానుడు .. ఆ డబ్బుకే దాసోహమై తమ పుట్టుకని తమ సంస్కృతిని మర్చిపోయి తమని తాము డబ్బు కోసం అమ్ముకుంటున్న వాళ్ళు ఎంత మందో, ఈ మెయిడ్ మార్కెట్ వలలో చిక్కుకుంటుంది ఎంతమందో.. అందరూ అలాగే ఉంటారని కాదు కాని చాలా మంది జీవితాలు చీకటి కోణాలే అని చెప్పక తప్పదు. ఇందులో తప్పెవరిది అని అంటే గల్ఫ్ యజమానులదని మాత్రమే తప్పు పట్టడానికి వీలు లేదు. అందరిదీ, అందరికీ వర్తిస్తుంది. మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది… అలాంటి మంచి గల్ఫ్ యజమానుల గురించి ఈ భాగంలో తెలుసుకుందాము. ఇలాంటి వాళ్ళ చేతుల్లో కనక భారత దేశ మహిళా పనిమనుషులు పడితే ఇక వాళ్ళ బ్రతుకు బంగారు బాటలే. ఒకసారి ఆ కథ ఎంటో చూద్దాము. 

 

కటిక దారిద్యంలో పుట్టిన అనంత ఏజెంట్ల సహాయంతో , ఏంబసీలో డాక్యుమెంటేషన్ కావించుకుని బిత్తర చూపులతో అమాయకత్వంతో ఇంట్లో పని, వంటపని తప్ప ఏమి తెలియని తనంతో గల్ఫ్ లో అడుగు పెట్టింది ఆమె అమాయకత్వం, ఆ బేలతనం అనేది ఆమె అదృష్టమనే చెప్పాలి. మాకన్నీ తెలుసు అని ఎగిరిపడేవాళ్ళ కన్నా ఈ అమాయకత్వం చాలా మంది యజమానులకి నచ్చే అంశం. అన్ని తెలిసినా మనకేమి తెలీదన్నట్లు ఉండడమే ఉత్తమ ఉద్యోగస్తుని ముఖ్య అర్హత. అదే జరిగింది ఈ అనంత విషయంలో ఏజెంట్ల ద్వారా వారు పంపిన ఆ గల్ఫ్ యజమానురాలు ఈమె అందానికే కాదు ఆ అమాయకత్వానికి లోకం తెలియని ఆ బేలతనానికి మురిసిపోయి పనిలోకి తీసుకుంది. తన యజమాని ఇంట్లో అందరికీ తల్లో నాలుకలా పనిచేస్తూ అందరికీ అభిమాన పాత్రురాలయింది అనంత. 

 

ఇంకా చదవండిప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆమెని ఒక పని అమ్మాయిలా కాక తన కూతురిలా చూసుకున్నారు ఆ గల్ఫ్ యజమానులు. ఆ అభిమానమే ఆమెకి చక్కటి వరుణ్ణి వెతికి తమ ఖర్చులతోనే పెళ్ళి చేసి, ఆమె అక్కడ ఉంటానంటే దానికయినా పర్వాలేదు లేదా స్వదేశానికి వెళ్తానంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని అభిమానంగా ప్రేమగా హామీ ఇచ్చారు ఆ యాజమాన్యం. వారి అభిమానానికి తలమునకలవుతూ ఈరోజుకి వారి వద్దే వారి కుటుంబంలో ఒక సభ్యురాలిగా అక్కడ ఒక పని అమ్మాయిలా పని చేస్తోంది అనంత. ఆమే జరుపుకునే పండగలకి, వాళ్ళు జరుపునే పండగలకి కొత్త బట్టలు, బంగారం ఏది కావాలంటే అది క్షణాల్లో సమకూర్చేవారు ఆ గల్ఫ్ యజమానులు , జీతంతో పాటుగా. ఈరోజు అనంతకి లేదనేది లేదు, స్వదేశంలో రెండు ఇళ్ళు కొనుక్కుంది. అక్కడ ఒక కారు, అయినా తన వృత్తి మార్చుకోలేదు. దర్జాగా ధీమాగా ఒక పద్ధతిలో, ఇటు సంసారం చేసుకుంటూ అటు అక్కడ గల్ఫ్ యజమానుల ఇంట్లో పని చేసుకుంటూ ఒక ఐశ్వర్యవంతురాలిగా , అక్కడ యజమానుల అభిమాన పుత్రికగా మంచి పేరు తెచ్చుకుని, స్వదేశ పదారణాల ఆంధ్ర ఆడపడుచు అని పేరు తెచ్చుకుంది. 

 

ఇంకా చదవండిహెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం! 34 ప్రాంతాల్లో 55 వేల కిలోల ఆహారం మరియు నీటిని పంపిణీ!

 

ఇదొక కోణం నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్న నానుడి ప్రకారం అందరికి తల్లో నాలుకగా ఎంతో అణుకువగా తన పని తాను చేసుకుంటూ అందరి మెప్పు పొందింది. అందరూ ఇలా ఉంటే అన్న ఆలోచన రాక మానదు ఈ ఉదంతం చూస్తే. 

 

ఇక మెయిడ్ మార్కెట్ ద్వారా వచ్చిన మన దేశంతో పాటు ఇతర దేశస్తులు వచ్చి వేశ్యా వృత్తి చేస్తూ పోలీసులకి పట్టుబడుతుంటారు. వీరి కి కఠిన శిక్షలతో పాటు గల్ఫ్ నుండి బహిష్కరిస్తుంటారు. అసలిలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు వీళ్ళు అనేకానేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తరువాత భాగంలో…

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి! 

 

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాజగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బైతన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!

 

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar