గల్ఫ్ లో పాలకి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులు! పెద్దలు చేసిన పాపానికి ఆ 2సం//, 6 నెలల పిల్లలకు శాపమా? ఇల్లీగల్ సంతానమని భారతదేశ పౌరసత్వం ఇవ్వరా? 6
Mon Sep 09, 2024 18:00 Gulf Newsమెయిడ్ మార్కెట్ Episode 6: -Ch. Raja Sekhar
గల్ఫ్ దేశాలలో జరిగే ఎన్నో సంఘటన లలో ఇది కూడా ఒకటి. డబ్బు సంపాదించాలని ఎన్నో ఆశలతో వెళ్లి. ఏదో ఒక కారణంతో తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులను కప్పిపుచ్చడానికి మరిన్ని తప్పులు చేయవలసి వస్తుంది.
ఇలాంటి కథే ఇవాళ ఒకటి తెలుసుకుందాం. ఈ కేసు గత మూడు నెలలుగా నడుస్తున్నది. కాబట్టి ఇక్కడ వారి పేర్లను గోప్యత కొరకు వాడటం లేదు. విషయం గమనించగలరు. పనిమనిషిగా గల్ఫ్ దేశానికి వెళ్ళిన అమ్మాయి. ఆమెకు భారతదేశంలో పెళ్లి కాలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత ఒక అతనితో పరిచయం ఏర్పడింది. అతనికి పెళ్లి అయ్యి భార్య బిడ్డలు ఉన్నారు. వారు భారత దేశంలో ఉంటారు.
ఇంకా చదవండి: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ!
ఇప్పుడు గల్ఫ్ లో ఉన్న ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. తర్వాత ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. అయితే వీరి సహజీవనానికి ఆమె గర్భవతి అయింది. అది చూసి అదే బిల్డింగ్ లో ఉన్నవారు వీరిద్దరికీ పెళ్లి లాంటి ప్రక్రియను చేశారు. కాని ఇది పెళ్లి కాదు. చట్టబద్ధత అంతకంటే కాదు. ఇలాంటి పనులను ఏ ప్రభుత్వం అంటే అటు భారత ప్రభుత్వం లేదా గల్ఫ్ ప్రభుత్వం అసలు అంగీకరించదు. అక్కడ పెళ్లి చూసుకోవాలి అంటే సరైన పద్ధతిలో అన్ని డాక్యుమెంట్లు సమర్పించి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది భారత రాయబార కార్యాలయం జారీ చేస్తుంది.
కానీ ఈ జంట ఇవేమీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పెళ్లి చెల్లదు. ఇప్పుడు ఆ అమ్మాయి ని హాస్పిటల్ లో జాయిన్ చేయాలి అన్నా కూడా లీగల్ గా భర్త సంతకం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరం. అవి ఏం లేవు గనుక పురుడు పోయడం తెలిసిన పెద్దవారి సహాయంతో ఇంట్లోనే బిడ్డల్ని కనడం కూడా అయిపొయింది. ఇది కూడా ఇల్లీగల్ వ్యవహారమే.
ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డకు ఆ దేశంలో ఉండే హక్కు లేదు. ఆ హక్కు రావాలి అంటే ఆ బిడ్డను లీగలైజ్ చేయాలి. అలా చేయాలి అంటే బర్త్ సర్టిఫికేట్ అవసరం. ఎంబసీ కి వెళితే వారు రుజువు అడుగుతారు. ఆ తలపోటు అంతా ఎందుకు అని ఆ జంట పట్టించుకోవడమే మానేశారు.
ఇప్పటికే ఒక తప్పు చేశామన్న భయం లేకుండా ఇంకో బిడ్డను కూడా మరుసటి సంవత్సరంలో కనడం జరిగింది. ఇప్పుడు ఒకరికి ఇద్దరు పిల్లలు. అంతా బానే సాగిపోతుంది అనుకున్న ఆ జంటకు ఇంకో ఆపద వచ్చి పడింది. ఆ అమ్మాయి ఇల్లీగల్ భర్త తాగి పోలీసులకు దొరికిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి ఆ దేశం నుండి డిపోర్టేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భర్త భారత్ లో ఉన్న ఫ్యామిలీతో ఉంటూ ఈ అమ్మాయిని పట్టించుకోవటం మానేశాడు. అదేవిధంగా ఈ అమ్మాయి కాల్స్ ని కూడా ఎత్తటం మానేశాడు. ఆ అమ్మాయి తన ఇద్దరు బిడ్డలతో ఇంకా గల్ఫ్ లోనే ఉంది. ఎక్కడన్నా పని చేసుకుందామంటే ఒక పాపకి 2 1/2 సంవత్సరాలు ఇంకో పాపకి 7 నెలలు. ఈ పిల్లలు వదిలేసి బయటికి వెళ్లి పని చేసుకునే పరిస్థితి లేదు. ఆ బిడ్డలకు పాస్ పోర్ట్ లేదు. వారిని తిరిగి భారత్ కు ఎలా తీసుకురావాలి అనే దిక్కు తోచని స్థితిలో ఉంది.
ఇంకా చదవండి: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
పాస్‌పోర్ట్ కోసం ఎంబసీని ఆశ్రయిస్తే వారు భారతదేశపు సంతానమే అనడానికి రుజువు ఏమిటి అని అడుగుతారు. శత్రుదేశం పిల్లలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని ఎంబసీ అనుమానిస్తుంది.
ఈ సమస్యకు పరిష్కారం ఎంటి అంటే ఆ పిల్లలకు ఆ అమ్మాయి కి DNA పరీక్ష చేయించి వారు భారత దేశం సంతతి అని నిరూపించాలి. లేదా వారు నిజంగా ఈ అమ్మాయి కి, ఆ భారతదేశ అబ్బాయికి పుట్టిన పిల్లలే అని కనీసం ఐదు సామాజిక సంస్థలు భరోసా ఇవ్వాలి. అప్పుడు ఎంబసీ ఆ పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి అనుమతులు అవసరం అవుతాయి. అంత సులువుగా, అంత త్వరగా అయ్యే అవకాశమే లేదు.
ఇదే విషయమై ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ ఎన్నార్టీ మరియు ఎన్నారై టీడీపీ సెల్ వారు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం ఎంబసీలో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ లోగా, ఇద్దరు చిన్న పిలల్ని పెట్టుకొని పనికి వెళ్లలేక, అక్కడ ఉండడానికి డబ్బు లేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో సహాయం చేయాలి అనుకుంటే ఆంధ్ర ప్రవాసి లేదా ఎన్నారై టీడీపీ కార్యకర్తలను లేదా తెలుగుదేశం కార్యాలయంలోని ఎన్నారై టిడిపి సెల్ ను లేదా ఏపీ ఎన్నార్టీ అధికారులను సంప్రదించగలరు. గోప్యత కొరకు వీరి పేర్లు, నివసిస్తున్న దేశాన్ని ఇక్కడ ప్రచురించడం లేదు అని గమనించగలరు.
గత వారంలోనే జరిగిన ఇలాంటి మరో సంఘటన... చిన్న పాపతో లైవ్ లో క్లోరెక్స్ తను తాగి ఆ పాపకు కూడా తాగించిన ఆ మోసపోయిన దీనురాలైన తల్లి కథ తరువాయి భాగంలో...
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.