గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

Header Banner

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

  Wed Sep 11, 2024 18:53        Gulf News

మెయిడ్ మార్కెట్ Episode 7: 
గత ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు గానే ఈ ఎపిసోడ్ లో గల్ఫ్ లో ఉద్యోగం కోసం అని వెళ్లి తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ పెద్ద సమస్యలను కొని తెచ్చుకుని అక్కడ నివసిస్తున్న ఒక అభాగ్యురాలి గురించి తెలుసుకుందాం. ఇక్కడ వీరి పేర్లను హైడ్ చేయడం జరిగింది. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్న కథకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ కథ. 

 

ఎన్నో ఆశలతో డబ్బు సంపాదించాలని గల్ఫ్ లో ఉద్యోగానికి వెళ్ళిన ఒక అమ్మాయి కథ ఇది. ఆమెది తూర్పు గోదావరి జిల్లా, ఆమెకు పెళ్లి అయింది. భర్త ఇండియాలోనే ఉంటాడు. తను ఒంటరిగా ఉద్యోగానికి గల్ఫ్ చేరుకుంది. 

 

ఇంకా చదవండిఅమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌! నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌! మీడియా స‌మాచారం ప్ర‌కారం! 

 

గల్ఫ్ కు వెళ్ళాక ఆమెకు ఒక అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సహజీవనం చేసేదాకా వెళ్ళింది. అతనికి కూడా ఇంతకుముందే వివాహం అయ్యింది. అతడి తల్లిదండ్రులు కూడా గల్ఫ్ లోనే ఉంటారు. 

 

ఇదిలా ఉండగా సహజీవనం చేస్తున్న అబ్బాయి, భారత్ లో ఉంటున్న ఆమె భర్తకు మెసేజ్ లు చేయడం, వీరి ఇద్దరి ఫోటోలు పెట్టడంతో ఆ భర్త పెద్దల సమక్షంలో ఈమెతో తెగతెంపులు చేసుకున్నాడు, ఇప్పుడు వారి ఇద్దరికీ ఎలాంటి సంబందం లేదు. 

 

అదంతా ముగిసింది అని హాయిగా ఉన్న సమయంలో ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదేంటి అంటే ఆ అబ్బాయి కి ఇంతకుముందే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అని, ఇందులో అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉంది అని. 

 

ఇంకా చదవండితెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

ఇవన్నీ తెలిసేలోపు ఆమె గర్భవతి కూడా అయ్యింది. హాస్పిటల్ కు వెళ్ళి సరైన పద్ధతిలో కాకుండా పురుడుపోయడం తెలిసిన వారి సాయంతో బిడ్డను కూడా కనింది. బిడ్డ పుట్టడంతో ఆమె లీగల్ గా పెళ్లి ప్రాసెస్ మొదలుపెడదామని అతన్ని కోరగా, ముందు పెళ్లి చేసుకున్న ముగ్గురిని చట్టబద్ధంగానే చేసుకున్నాను వారు నాతో కలిసి ఉండలేదు. మనకి కూడా చట్టబద్ధంగా పెళ్లి అయితే మనం కూడా అలాగే విడిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి వాయిదా వేస్తూ వచ్చాడు. అలా కొన్ని రోజులకు ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. 

 

అతను మరియు అతడి కుటుంబ సభ్యులు కలిసి ఆమెను శారీరకంగా చిత్రవధకు గురిచేయడం మొదలుపెట్టారు. అయినా సరే బిడ్డ కోసం అన్నీ భరించింది. ఆ తరవాత ఆ కుటుంబం మొత్తం ఆమెను, ఆమె బిడ్డని అక్కడే వదిలేసి గల్ఫ్ నుండి వెళ్ళిపోయారు. బిడ్డకు లీగల్ రైట్స్ లేకపోవడంతో ఆమె ఆ బిడ్డతో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. 

 

ఇంతకు ముందే 3 పెళ్లిల్లు చేసుకొని తనని మోసం చేసాడనే బాధ, బిడ్డతో పని కి వెళ్ళలేక డబ్బులు లేక ఆ దేశంలో ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో ఆత్మహత్య ఒక్కటే దిక్కు అని క్లోరెక్స్ తాగి తన బిడ్డకు కూడా తాగించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అదృష్టవశాత్తూ సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకువెళ్ళడంతో ఇద్దరూ ప్రమాదం నుండి బయట పడ్డారు. చికిత్స నిమిత్తం 10 రోజులు హాస్పిటల్ లో ఉన్నారు. ఎంబసీని సంప్రదించాలి అంటే అదొక పెద్ద తంతు. అది ఎలా ఉంటుంది, ఏం చేయాలనేది మనం గత ఎపిసోడ్ లో చూసాము. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడంకోసం ఇక్కడ ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 

 

ఇటీవల ఆమె ఎంబసీకి వెళ్తే డీఎన్ఏ టెస్ట్ చేయించాలని తెలిపారు. 2 రోజుల క్రితమే హాస్పిటల్ కు వెళ్లి డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంది. ఆ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి 4 నుండి 5 నెలల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డతో అక్కడ ఉండడం ఎంతో కష్టం. ఎవరైనా సహాయం చేయగలరా అని ఎదురుచూస్తుంది. 

 

ఎవరైనా మానవతా దృక్పథంతో సహాయం చేయాలి అనుకుంటే ఆంధ్ర ప్రవాసి లేదా ఎన్నారై టీడీపీ కార్యకర్తలను లేదా తెలుగుదేశం కార్యాలయంలోని ఎన్నారై టిడిపి సెల్ ను లేదా ఏపీ ఎన్నార్టీ అధికారులను సంప్రదించగలరు. గోప్యత కొరకు వీరి పేర్లు, నివసిస్తున్న దేశాన్ని ఇక్కడ ప్రచురించడం లేదు అని గమనించగలరు. 

 

ఇక మరొక ఎపిసోడ్ లో ఏజెంట్ల చేతిలో మోసపోయి ఎడారి దేశాల్లో నా అనేవారు లేక ఎన్నో బాధలు పది అనాధాలుగా మారిన కొందరి కథ తెలుసుకుందాం...

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి! 

 

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై! 

 

5. గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!  

 

6. గల్ఫ్ లో పాలకి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులు! పెద్దలు చేసిన పాపానికి ఆ 2సం//, 6 నెలల పిల్లలకు శాపమా? ఇల్లీగల్ సంతానమని భారతదేశ పౌరసత్వం ఇవ్వరా?

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar