గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
Mon Sep 30, 2024 17:09 Gulf News, గల్ఫ్ లో మెయిడ్ మార్కెట్మెయిడ్ మార్కెట్ ఎపిసోడ్ 10: By - Ch. Raja Sekhar
కుగ్రామంలో కూలి మనిషి గల్ఫ్ ఇంట్లో పనిమనిషిగా మారిన వైనం.
ఒక మారుమూల కుగ్రామం. నాలుగు కుంటలు బీడు భూమి, తాగుబోతు మొగుడు, ఒక పాప, బాబు, ఒక ఆవు లేగ దూడ. వేకువనే నిద్ర లేచి, చెత్త పేడ తోసుకొని పాపకి, భర్త కి చద్దనం కలిపిపెట్టి, పాత చీరని ఉయ్యాలగా కట్టి, బాబుని అందులో పడుకోబెట్టి, పాల బుడ్డి పక్కన పెట్టి, మొగుడిని నిద్రలేపి, పాపని స్కూల్ కి పంపించమని, బాబు ఏడిస్తే పాల బుడ్డి నోట్లో పెట్టమని, పాప, నువ్వు చద్దన్నం తినండని చెప్పి, తను మాత్రం చెంబుడు మంచి నీళ్ళుతో కడుపు నింపుకొని, కూలికి బయలుదేరింది కనకం. వరికోత, కలుపుతీయడం ఇలా ప్రతి పనికీ వెళ్ళేది.
అక్కడ మద్యాహ్నం వాళ్ళు పెట్టిన అన్నం తీసుకొని, ఇంటికి వచ్చి పాపకి. మొగుడికి పెట్టి, తనూ కొంచం తిని మళ్ళీ పనిలోకి వెళ్ళేది. ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసి, నూరు రూపాయల కూలి డబ్బులతో ఇంటికి వస్తే, ఆరు బయట నులక మంచంపై బీడీ తాగుతున్న భర్త, ఆ కూలీ డబ్బులు ఇవ్వమని పశువులా చితకబాది, ఆ వందలో యాభై రూపాయలు లాక్కొని పోయాడు. మిగిలిన యాభై రూపాయలతో బాబుని సంకనేసుకొని, పాపని పిలుచుకొని, కిరణా కొట్టుకి వెళ్ళి, కిలో బియ్యం, సరుకులు పాపకొక బొంబాయి మిఠాయి తీసుకొని, ఇంటికి వచ్చి, వంట చేసి, పిల్లలకి పెట్టి వాళ్ళను నిద్ర పుచ్చి, తను తినకుండా మొగుడి కోసం ఎదురు చూసేది. ప్రతి రోజు పదకొండుకి పైనే ఇంటికి వచ్చేవాడు.
ఇంకా చదవండి: ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య!
ఇక వచ్చిన తరువాత అన్నం పెట్టి, అతను చెప్పిన దానికంతా తాన తందాన అంటూ వుండేది. మద్యలో ఏమైనా మాట్లాడితే ఇక పిడుగుద్దులు తప్పవు. ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో..... ఒకరోజు రెడ్డోరి మడిలో వరికోతకని కొడవలి చేతపట్టుకొని గరిసమీద పోతావుంటే ఎదురుపడింది పక్కవూరి శ్యామలమ్మ (ప్రైవసీ కోసం పేరు, ఊరు పేర్లు మార్చడం జరిగింది). మాటామాటలో " ఏమే కనకం మీ వూరిలో రాణెమ్మ గల్ఫ్ దేశాలకు పోయి వచ్చిందంట కదా! బాగా సంపాదించుకొని వచ్చిందంట, కలర్ టివి, పెద్ద టంకు పెట్టెలో సామాన్లు బాగానే తీసుకొనివచ్చిందంట.
నేనుకూడా పోవాలని పసుబూక్ (పాస్ పోర్ట్) తయారు చేపిస్తున్నా. నువ్వు కూడా ఆమెని అడిగి వీసా తెప్పించుకో, ఎన్ని రోజులు ఈ కష్టాలు? అక్కడకి పోయి రెండు సంవత్సరాలు పని చేసుకొని వచ్చావంటే అన్ని కష్టాలు తీరిపోతాయ్” అని చెప్పింది. అందుకు కనకం: అక్కడకి పోవాలంటే మాటలా? చాలా డబ్బులు కర్సు అవుతాయంట, మా దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి? అయినా నా మొగుడు పంపుతాడా పాడా!!! అని ఊరుకుంది. ఆ రోజు ఇంటికి వచ్చిన తరువాత రోజు మాదిరగానే మొగుడు కొట్టడం అన్నీ జరిగిపోయాయి. నిద్ర రావడంలేదు, శ్యామలమ్మ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆడపిల్ల పెద్దవుతూ వుంది, దాని పెళ్లి ఎలా చెయ్యాలి? మొగుడు చూస్తే ఈ విధంగా వున్నాడు? ఎలా ?.....!
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
మరుసటి రోజు కూలికి పోయి వచ్చేప్పుడు రాణెమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రాణెమ్మ! రాణెమ్మ! అని తలుపు కొట్టింది. లోపలనుంచి పెద్ద పెద్ద సౌండ్ తో పాటలు వినపడుతున్నాయి. రాణెమ్మ తలుపు తీసింది, తెరవగానే సెంటు వాసనలు ఘుమ ఘుమలాడాయి. ఇంటిలో ఎక్కడ చూసినా గల్ఫ్ నుండి తెచ్చిన వస్తువులే, వాళ్ళ పిల్లలు రంగు రంగుల బట్టలేసుకొని ఆడుకుంటున్నారు. రాణెమ్మను అడిగింది, "రాణెమ్మా! నాకు ఏమైనా సహాయం చేయగలవా? నేను అక్కడికి వచ్చి నలుగు రూపాయలు సంపాదించుకుంటా, ఆడపిల్ల పెద్దదైపోతాంది, ఏదో రెండు సంవత్సరాలు కష్టపడుకుని అంతో ఇంతో మిగలబెట్టుకోవాలని వుంది...”
రాణెమ్మ: "కనకం కువైట్ పోవాలంటే మాటలా??? ఎంత డబ్బు కర్చు అవుతుందో తెలుసా? ముందు పాస్పోర్ట్ చేయించుకోవాలి, అందుకు పదివేలు అవుతుంది, తరువాత కావాలంటే నేను వీసా పంపుతాను, వీసాకి యాభై వేలు అవుతుంది, అందరు ఒక లక్ష రూపాయలు తీసుకుంటున్నారు, నీకని నేను యాభై వేలు చెబుతున్నా, వేరే ఎవరికీ చెప్పొద్దు, ఇంక ఇక్కడ ఏజెంట్ కి టికెట్ కి అంతా కలిపి యాభై వేలు దాకా అవ్వచ్చు, నేను ఇంక నెల రోజుల్లో మళ్ళీ వెళ్తున్నా, మీ ఆయనతో మాట్లాడుకొని పాస్పోర్ట్ తెప్పించుకో " అని చెప్పింది...
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
"అమ్మో అంత డబ్బు అవుతుందా అని వచ్చేసింది. కనకంకి నిద్ర రావడం లేదు, ఆ సెంటు వాసనలు, కలర్ టివి, రంగు రంగుల బట్టలే గుర్తుకొస్తున్నాయి. తన మనసులో మాట మొగుడితో చెప్పింది. అంతా విన్న మొగుడు ఏమే ఊరు అయిపోయింది ఇంక దేశాలమ్మిడీ పోవలనుకున్టున్నవా, ఆమె ఏమి చేసి సంపాదించిందో ఎవరికి తెలుసు అని చితకబాదాడు. కొద్ది రోజుల తరువాత రాణెమ్మ గల్ఫ్ కి బయలుదేరుతూ కనకం వాళ్ళ ఇంటికి వచ్చి “ఏమే కనకం ఏమనుకున్నారు? నువ్వు వస్తానంటే నేను వీసా పంపుతాను పాస్పోర్ట్ చేపించుకో అంటూ ప్రక్కనే వున్నా కనకం మొగుడితో ఇలా అంది, అక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా నేను వున్నాను, ఇంట్లో నుండి బయటకి కూడా పంపరు, అప్పో సప్పో చేసుకొని పోతే ఆరు నెలల్లో అప్పులు అన్నీ తీరిపోతాయి, ఆలోచించుకోండి అని వెళ్లిపోయింది.
ఒకరోజు కనకం మొగుడు తాగని సమయంలో ఇద్దరూ మాట్లాడుకొని ఒప్పించింది, పంపేందుకు ఒప్పుకున్నాడు. ఉన్న పాలిచ్చే ఆవుని, దూడని అమ్మి పాస్పోర్ట్ తెప్పించారు. రాణెమ్మకి పంపించారు, నెలరోజుల్లో వీసా పంపుతాను యాభై వేలు ఇంట్లో కట్టమని చెప్పింది రాణెమ్మ. సర్పంచి అన్న దగ్గరకి పోయి వున్న నలుగు కుంటల భూమిని తాకట్టు పెట్టి, మూడు రూపాయల వడ్డీతో లక్ష రూపాయలు తీసుకున్నారు. యాభై వేలు రాణెమ్మ ఇంట్లో ఇచ్చేసారు. రాణెమ్మ వీసా కూడా పంపించేసింది.
గల్ఫ్ లో కనకం పడే కష్టాలు తరువాయి భాగంలో......
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
9. గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.