ఆ ఎయిర్ పోర్ట్ లో అధికారులను చితకబాదిన ఆంధ్ర యువతి! చివరికి పిచ్చాసుపత్రి లో! పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబంపై బెంగ!

Header Banner

ఆ ఎయిర్ పోర్ట్ లో అధికారులను చితకబాదిన ఆంధ్ర యువతి! చివరికి పిచ్చాసుపత్రి లో! పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబంపై బెంగ!

  Mon Oct 07, 2024 20:39        Gulf News, గల్ఫ్ లో మెయిడ్ మార్కెట్

11. మెయిడ్ మార్కెట్ - అప్పు చేసి మరీ డబ్బు సంపాదనకై గల్ఫ్ కి వెళ్ళి మతిస్థిమితం కోల్పోయింది...!!

By - Ch. Raja Sekhar

కనకం కష్టపడి ఏజెంట్ ద్వారా గల్ఫ్ వెళ్ళింది అని తెలుసుకున్నాము కదా! ఆమె ఒక ఇంట్లో మెయిడ్ గా చేరింది. అక్కడ ఆమెకి కొన్నాళ్ళు బాగానే గడిచింది. మరి ఆమెని అక్కడి యజమానులు ఏవిధమైన చిత్ర హింసలకి గురిచేశారో ఏమో కాని ఆమె మానసిక స్థితి క్షీణించడం మొదలయింది. రాను రాను అదొకరమైన మాటలు, చేతిలో ఉన్నవి విసిరి కొట్టడం, వింతగా నవ్వడం, ఆమె కాలకృత్యాలు కూడా ఆమె తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంది అంటే నమ్ముతారా? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆమె పిచ్చి చేష్టలు చూసి కువైట్ యజమానులు ఆమెని తీసుకోవచ్చున ఏజెంట్ కి అప్పజెప్తే, మరి అతడిని గుర్తు పట్టిందో ఏమో విపరీతంగా నవ్వుతూ, పిచ్చి చేష్టలకి దిగి, అతనని పిడిగుద్దులు గుద్దింది కనకం. అతను ఈ చర్యలకి బెంబేలెత్తిపోయి ఆమెని వెంటనే మానసిక చికిత్సాలయానికి వంటినిండా గొలుసు కట్టుతో తీసుకువెళ్లి జాయిన్ చేశారు. ఆమె మెయిడ్ గా చేరిన యజమానురాలిని పిలిచి ఆమెకెందుకీ స్థితి అని ఆరా తీయగా తెలియదని అని చెప్పింది. కనకం తన దగ్గర పని ప్రారంభించి మొదట్లో బానే ఉండేదని సంవత్సరం తరువాత ఆమెలో శారీరక బలహీనత చోటు చేసుకుందని, అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ, పిచ్చి పిచ్చి మాటలు అసభ్యంగా మాట్లాడడం లాంటివి చేసేదని ఆ బాధ భరించలేక స్పాన్సర్స్ కి అప్పజెప్పామని తెలియజేశారు. వెంటనే ఆ స్పాన్సర్ తనకు టికెట్ ఇచ్చి ఇంటికి పంపించాలని ఏర్పాటుకు తీసుకురాగా అక్కడ కూడా ఇదే విధంగా రాద్ధాంతం చేసింది అని ఆ కువైట్ స్పాన్సర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. 

 

ఇంకా చదవండిసీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ! 

 

ఆమెనూ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఏజెంట్ ఆమెని స్వదేశానికి పంపుదామని యోచించాడు కాని విమానాశ్రయం దగ్గర ఆమె అధికారులని బలంగా కొడుతూ హాని కలిగించడం వల్ల విమానాశ్రయ సిబ్బంది హాస్పిటల్ కి తీసుకువచ్చారని తెలిపాడు. ప్రస్థుతం ఇలాంటి వారు గల్ఫ్ దేశాలలోని మానసిక చికిత్సాలయలలో చికిత్స పొందుతూ ఎంతోమంది ఎవరికి ఏమి కానట్టు తమ జీవితాన్ని వెల్లపుచ్చుతున్నారు. 

 

ఇలాంటి మెయిడ్స్ యదార్థ కథలు ఎన్నో ఈ గల్ఫ్ దేశాలలో వాళ్లకేమి జరిగిందో తెలీదు, ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ డబ్బు సంపాదిద్దామని గల్ఫ్ వస్తారు. చక్కటి సంసారం, ఇద్దరు పిల్లలు, తను తిందో లేదో కాని పని చేసుకుంటూ, ఏ అప్పు లేకుండా హాయిగా ఉన్న కనకం పరిస్థితి ఈరోజు ఎటూ కాని పరిస్థితిలో ఉంది. ఇలాంటి ఇంకెంతమంది కనకాలు ఉన్నారో ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో వ్యధాభరిత గాథ.

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు: 

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి! 

 

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై! 

 

5. గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!  

 

6. గల్ఫ్ లో పాలకి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులు! పెద్దలు చేసిన పాపానికి ఆ 2సం//, 6 నెలల పిల్లలకు శాపమా? ఇల్లీగల్ సంతానమని భారతదేశ పౌరసత్వం ఇవ్వరా?

 

7. గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 

 

8. గల్ఫ్ లో ఏజెంట్ చేతిలో మోసపోయి అనాథగా మారిన ఆంధ్ర అమ్మాయి! ప్రాణం, మానం అర చేతిలో పట్టుకొని! దిక్కుతోచని పరిస్థితుల్లో! 

 

9. గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 

 

10. గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీమారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar