గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

Header Banner

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

  Fri May 03, 2024 17:47        Business

Gold Loans: ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు అత్యంత వేగంగా లోన్ పొందాలంటే బంగారంపై రుణాలు ముందు వరుసలో ఉంటాయి. చాలా మంది తమ బంగారాన్ని బ్యాంకులు తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. వీటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, రూ. 5 లక్షలు లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ ఎంత కట్టాలి? తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్లు ఇస్తోన్న బ్యాంకుల జాబితా ఓసారి పరిశీలిద్దాం.

 

Gold Loans: రూ.5 లక్షల గోల్డ్ లోన్ తీసుకుంటే.. ఈఎంఐ ఎంత కట్టాలి? టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇవే!

 

Gold Loans: బంగారం అనేది ప్రస్తుత రోజుల్లో అలంకరణకు మాత్రమే కాదు ఆర్థిక భరోసా కూడా. డబ్బులు అసరమైనప్పుడు బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు సైతం తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇస్తుంటాయి. అలాగే ఈ రుణాలు తీసుకునేందుకు డాక్యుమెంటేషన్ సైతం చాలా తక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఏదైనా వ్యాపారం కోసం, ఇతర అవసరాలకు బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వాటిని సకాలంలో చెల్లించి తిరిగి తమ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ.66 వేలు దాటింది. ఇప్పుడు బంగారంపై బ్యాంకులు సైతం ఎక్కువ లోన్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అలాగే చాలా బ్యాంకుల్లో 9 శాతం కన్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ క్రమంలో 2 ఏళ్ల కోసం బ్యాంకులో బంగారం కుదువ పెట్టి రూ.5 లక్షల లోన్ తీసుకుంటే.. నెలకు ఈఎంఐ ఎంత పడుతుంది? తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తోన్న బ్యాంకులు ఏవి? అనేది తెలుసుకుందాం.

 

ఇంకా చదవండి: 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ క్యాన్సిల్! పతంజలి ఉత్పత్తులపై బ్యాన్! బాబా రాందేవ్​ కు షాక్​!

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

 

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తక్కువ వడ్డీ రేటుకే బంగారం లోన్లు ఇస్తోంది. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీకే బంగారం రుణాలు ఇస్తోంది. మీరు రెండేళ్ల టెన్యూర్ పై రూ.5 లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ రూ.22,568 పడుతుంది.

 

ఇండియన్ బ్యాంక్..

 

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ లో బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. మీరు 2 ఏళ్ల టెన్యూర్ కోసం రూ.5 లక్షల బంగారం లోన్ తీసుకుంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ.22,599 పడుతుంది.

 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

 

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బ్రాంచీలు గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ మంది బంగారం లోన్లు తీసుకుంటున్నారు. ఇందులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.7 శాతంగా ఉంది. మీరు రూ.5 లక్షల లోన్ 2 ఏళ్ల టెన్యూర్ పై తీసుకుంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ.22,610 పడుతుంది.

 

బ్యాంక్ ఆఫ్ ఇండియా..

 

మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.8 శాతంగా ఉది. మీరు ఇందులో 2 ఏళ్ల కోసం రూ.5 లక్షల బంగారం లోన్ తీసుకుంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ.22,631 కట్టాల్సి ఉంటుంది.

 

కెనరా బ్యాంక్, పీఎన్‌బీ..

 

కెనరా బ్యాంక్ సహా పంజాబ్ నేషనల్ బ్యాంకులు గోల్డ్ లోన్లపై వడ్డీ 9.25 శాతం వసూలు చేస్తున్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో రూ. 5 లక్షల గోల్డ్ లోన్ తీసుకుంటే మీకు నెల వారీ ఈఎంఐ రూ.22,725 పడుతుంది.

 

ఎస్‌బీఐ..

 

పబ్లిక్ సెక్టార్ లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 9.6 శాతంగా ఉన్నాయి. మీరు 2 ఏళ్ల కోసం రూ.5 లక్షల లోన్ తీసుకుంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ.27980 కట్టాల్సి వస్తుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #GoldLoan #Banks #GoldLoanInbank