ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!

Header Banner

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!

  Fri May 03, 2024 21:17        Business

 Income Tax: ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెలలోకి ప్రవేశించాం. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఇన్‌కమ్ ట్యాక్సుకు సంబంధించి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలు, డెడ్‌లైన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీఎస్ సర్టిఫికెట్ జారీ కోసం కలెక్ట్ చేసిన ట్యాక్సులు, డిడక్షన్లు డిపాజిట్ చేయడం నుంచి వివిధ సకాల స్టేట్మెంట్లను ఫైలింగ్ చేసేందుకు ఈ మే నెల చాలా ముఖ్యమైనదిగా ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ గడువు దాటితే భారీగా పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే కచ్చితంగా గడువుకు ముందే మీ పన్ను బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మే, 2024 నెలలో ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మే 7వ తేదీ: గత నెల ఏప్రిల్, 2024కు సంబంధించి డిడక్టెడ్ లేదా కలెక్టెడ్ ట్యాక్సులు డిపాజిట్ చేసేందుకు మే 7వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ ట్యాక్సులను గడువు లోపు కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చలాన్ లేకుండా పన్ను చెల్లించినట్లయితే అదే రోజున కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ కు డిపాజిట్ చేయాలి.

 

దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?

 

మే 15వ తేదీ: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 194-1ఏ, 194-1బీ, 194ఎం, 194ఎస్ వంటి సెక్షన్ల కింద డిడక్ట్ చేసిన ట్యాక్సులకు సంబంధించిన టీడీఎస్ సర్టిఫికెట్లు మార్చి, 2024 నెల కోసం జారీ చేసేందుకు మే 15వ తేదీ గడువు. అలాగే ఇది చలాన్ లేకుండా ఏప్రిల్ 2024లో చెల్లించిన టీడీఎస్, టీసీఎస్ కోసం ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ఫామ్ 24జీని అందించడానికి గడువును సూచిస్తుంది. అలాగే మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికినాకి గానూ టీసీఎస్ డిపాజిట్ చేసిన క్వార్టర్లీ స్టేట్మెంట్ ఫైలింగ్ చేసేందుకు ఇదే గడువుగా ఉంది. ఏప్రిల్ నెలకు సంబంధించి క్లయింట్ కోల్డలను సవరించిన లావాదేవీలకు సంబంధించి.. స్టాక్ ఎక్స్చేంజీలకు ఫారమ్ 3బీబీలో స్టేట్మెంట్ అందించేందుకు చివరి తేదీగా ఉంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మే 30వ తేదీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇండియాలో అనుబంధ కార్యాలయాన్ని కలిగి ఉన్న నాన్ రెసిడెంట్స్ ఫామ్ 49సీ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మే 30 వరకు గడువు ఉంటుంది. అలాగే సెక్షన్ 194 1ఏ, 1బీ, 194ఎం, 194ఎస్ కింద ఏప్రిల్ నెల ట్యాక్స్ డిడక్షన్లకు సంబంధించి చలాన్ కమ్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసేందుకు గడువు సైతం ఇదే. అలాగే 2023-24 నాలుగో త్రైమాసికానికి టీసీఎస్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సైతం మే 30 డెడ్‌లైన్ గా ఉంది.

 

భారతీయులకు స్కెంజెన్ వీసా కష్టాలు! బలమైన కారణాలు లేకుండానే రిజెక్షన్! ఆర్థికంగా నష్టపోతున్న టూరిస్టులు

 

మే 31వ తేదీ: మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ డిపాజిట్ క్వార్టర్లీ స్టేట్మెంట్ సబ్మిట్ చేసేందుకు మే 31 వరకు గడువు ఉంటుంది. అలాగే ఆమోదం పొందిన సూపర్ యాన్యుయేషన్ పండ్ ట్రస్టీలు చెల్లించిన విరాళాలపై పన్ను మినహాయింపును తిరిగి పొందేందుకు గడువు ఇదే. ఫామ్ 61ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మే 31 వరకు గడువు ఉంది.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి:    

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మీడియా సమావేశం! పలు కీలక విషయాలు

 

అనంతపురం: జాతీయ రహదారిపై నాలుగు కంటైనర్ల కరెన్సీ! పరిశీలిస్తున్న పోలీసులు షాక్!

 

ఆస్పత్రి పాలైన యాంకర్ అనసూయ! ప్రస్తుతం పుష్ప2లో కీలక పాత్ర!

 

భారతీయులకు స్కెంజెన్ వీసా కష్టాలు! బలమైన కారణాలు లేకుండానే రిజెక్షన్! ఆర్థికంగా నష్టపోతున్న టూరిస్టులు

 

Evolve Venture Capital 

 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

 

ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #TaxTime #TaxPayers #AndhraPravasi #TeluguMigrants #Bussiness #IncomeTax