వాట్సాప్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరిక! ఇలా అస్సలు చేయొద్దు!

Header Banner

వాట్సాప్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరిక! ఇలా అస్సలు చేయొద్దు!

  Sun Nov 17, 2024 09:00        Business

ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రస్తుతం వాట్సాప్ వాడుతున్నారు. ఇక వాట్సాప్ లో వచ్చిన వివిధ వీడియోలను, వివిధ పోస్టులను ఓపెన్ చేసి చూస్తున్నారు. ఫోన్ వినియోగిస్తున్న వారికి వాట్సాప్ వినియోగం దినచర్యలో భాగంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాట్సాప్ లో పెళ్లి పత్రికలు పంపి వాటిని పొరపాటున డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ లోకి చొరబడి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం పెరిగిపోయారు. ఈ క్రమంలోనే వాట్సాప్ వాడుతున్న వినియోగదారులకు మెటా హెచ్చరికను జారీ చేస్తుంది. వాట్సాప్ లో అపరిచిత వ్యక్తులు పంపుతున్న వీడియోలను, లింకులను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తోంది. అసలు ఈ హెచ్చరిక వెనుక కారణమేమిటంటే ఇటీవల కాలంలో డిజిటల్‌ ఆహ్వాన పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్‌ మ్యాప్స్‌ లింక్‌‌ను

 

ఇంకా చదవండి: ఇష్టమొచ్చినట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? పరిమితి మించితే నోటీసులొస్తాయి జాగ్రత్త!

 

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు పంపుతున్నారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ కు లింకులు పంపుతున్నారు. అయితే వాటిని ఎవరు పంపారు అనే ఆసక్తితో మనం వాటిని క్లిక్ చేస్తున్నాం.. దీంతో మన ప్రమేయం లేకుండా మన ఫోన్లోకి ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ డౌన్లోడ్ అవుతుంది. మన ఫోన్ లోని గ్యాలరీ, యాప్ ల లోని డేటాతో సహా అన్ని రకాల అనుమతులను ఈ మాల్వేర్ హ్యాక్ చేస్తుంది. ఆపై మన ఫోన్లో హ్యాకింగ్ కు సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ అయ్యి, ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది. దీంతో సైబర్ నేరగాళ్లు మన ఫోన్ లోని బ్యాంకు ఖాతాల ద్వారా అకౌంట్లో లోని డబ్బులను ఖాళీ చేస్తారు. అంతేకాదు ఫోన్ లోని వ్యక్తిగత ఫోటోలు సేకరించి, వ్యక్తిగత డేటా సేకరించి బెదిరింపులకు పాల్పడతారు. కాబట్టి వాట్సాప్ వినియోగదారులు మనకు తెలియని అపరిచిత వ్యక్తులు వాట్సాప్ లో ఏమైనా పంపితే దయచేసి ఓపెన్ చేయొద్దు. అంతేకాదు వాట్సాప్ లో అనుమానాస్పదంగా ఉన్న లింకులను ముట్టుకోకుండా ఉంటే మంచిది. ఏదిఏమైనా వాట్సాప్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త.



ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

 

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Whatsapp #Accounts #Ban #India #WhatsupProblems #WhatsAppCases