గోల్డ్‌ లోన్‌ చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్‌! త్వరలో కొత్త విధానం తేనున్న ఆర్‌బీఐ!

Header Banner

గోల్డ్‌ లోన్‌ చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్‌! త్వరలో కొత్త విధానం తేనున్న ఆర్‌బీఐ!

  Wed Nov 20, 2024 19:59        Business

అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం బంగారం రుణాలను వడ్డీతో కలిపి అసలు కలిపి చెల్లించాల్సిందే. దాంతో చాలామంది వడ్డీతో కలిపి గడువులోగా తిరిగి చెల్లించడం ఇబ్బందికరంగా మారుతున్నది. దాంతో బంగారు ఆభరణాలు వేలానికి వెళ్లే పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపబోతున్నది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. బంగారం ఆభరణాలపై తీసుకునే రుణాలను ఈఎంఐ రూపంలో చెల్లించే సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బంగారు రుణాల మంజూరులో అవకతవకల నేపథ్యంలోనే ఈఎంఐ విధానం అయితే బాగుంటుందని ఆర్‌బీఐ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వాస్తవానికి, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని సెప్టెంబర్ 30న ఆర్బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. బంగారంపై రుణాలు అందించే సంస్థల పనితీరులో అవకతవకలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. రుణాల సోర్సింగ్, మదింపు కోసం ఉపయోగించే థర్డ్‌ పార్టీల్లో అనేక లోపాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఆభరణాల వేలంలోనూ పారదర్శకత లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల గోల్డ్‌ రుణాల్లో భారీగానే వృద్ధి ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. వ్యవస్థీకృత రుణదాతల పోర్ట్‌ఫోలియో మార్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల ఆభరణాల రుణాలు 51 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Loans #GoldLoans