ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!

Header Banner

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!

  Mon May 20, 2024 17:04        Sports

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్లు అత్యంత అరుదు. అటు అంతర్జాతీయ క్రికెట్లోనూ, ఇటు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ... ఎక్కడ ఆడినా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడం ధోనీకే సాధ్యమైంది. 35 ఏళ్లకే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న నేటి కాలంలో, 42 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు దీటైన ఫిట్ నెస్ ధోనీ సొంతం. 

 

ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు అలుపెరగకుండా ఆడుతున్న ధోనీ, ఈ లీగ్ కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్నది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. 

 

ధోనీ ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఐదుసార్లు చాంపియన్ గా నిలిచింది, మరో ఐదుసార్లు రన్నరప్ గా నిలిచింది. గతేడాది ఐపీఎల్ విజేత చెన్నై జట్టే. కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్నతస్థానం కల్పించిన ధోనీని వదులుకోవడానికి ఆ జట్టు యాజమాన్యం ఎప్పుడూ సిద్ధపడింది లేదు. ఎంతో అంకితభావంతో ఆడే ధోనీ లాంటి ఆటగాడిని అసలే జట్టూ వదులుకోలేదు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ధోని రిటైర్మెంట్ గురించి అడిగితే చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం ఎప్పుడూ చెప్పే మాటే ఇప్పుడూ చెబుతోంది. "ఈ సీజన్ లో ధోనీ వికెట్ల మధ్య పరిగెత్తడంలో ఎక్కడా ఇబ్బంది పడింది లేదు. వచ్చే సీజన్ లోనూ అతడిని ఆడించాలని అభిమానులు కోరుతున్నారు. ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా, ప్రత్యేకంగా బ్యాటింగ్ కోసమే ఉపయోగించుకోవాలని అభిమానుల నుంచి సందేశాలు వస్తున్నాయి. అయితే కెప్టెన్ కూల్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది మాకు తెలియదు. 

 

తన నిర్ణయాన్ని మేనేజ్ మెంట్ కు తెలియజేసేందుకు ధోనీ కొంత టైమ్ తీసుకుంటాడని భావిస్తున్నాం. ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఆమోదయోగ్యమే. ఎందుకంటే, ధోనీ ఎప్పుడూ జట్టు  మనిషి, జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించే ఆటగాడు. రిటైర్ అవుతానని ఇప్పటివరకైతే మాకేమీ చెప్పలేదు" అని సీఎస్కే ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.

 

ఇవి కూడా చదవండి: 

బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి! 

 

'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు'! కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు! హేమ వ్యాఖ్యలు! 

 

ఓరి దేవుడో... ఇదెక్కడి టెక్నాలజీ రా బాబు! మెదడులో మైక్రో చిప్ తో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువకుడు! వైరల్ అవుతున్న వీడియో! 

 

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి! తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు! మాదకద్రవ్యాలు స్వాధీనం! 

 

జూలై 20, 21 న కమ్మ గ్లోబల్ సమ్మెట్! విజయవాడలో ప్రముఖులతో సమావేశం! ప్రపంచానికి కమ్మవారు చేసే మేలు పై అవగాహన! 

 

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు మరెన్నో! ఆలస్యం ఎందుకు మిత్రమా చూసేయ్! 

 

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి! 

 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

 

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి! 

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్! 

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్! 

        

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Cricket #MSD #MSDhoni #IPL #CricketLeague