ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సంజు శాంసన్, తిలక్ వర్మ! భారత్ తరపున ఏ వికెట్‌కైనా!

Header Banner

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సంజు శాంసన్, తిలక్ వర్మ! భారత్ తరపున ఏ వికెట్‌కైనా!

  Sat Nov 16, 2024 08:49        Sports

జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బ్యాటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మ సంచలన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసి చెరో సెంచరీ సాధించారు. శాంసన్ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 56 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 47 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. కడవరకు నాటౌట్‌గా నిలిచిన వీరిద్దరు రెండవ వికెట్‌కు ఏకంగా 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పలు క్రికెట్ రికార్డులు బద్దలయ్యాయి. టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా సంజూ-తిలక్ వర్మ పార్ట్‌నర్‌షిప్ నిలిచింది. అంతేకాదు టీ20లలో దక్షిణాఫ్రికాపై ఇదే అతిపెద్ద పార్టనర్‌షిప్‌గా రికార్డులకెక్కింది.

 

ఇంకా చదవండి: కోహ్లీ గురించి రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు! జట్టులో కీలకంగా మారనున్న సీనియర్ ప్లేయర్!

 

ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండవ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదయింది. వీరిద్దరూ కలిసి 210 పరుగుల పార్టనర్‌షిప్‌ని కేవలం 93 బంతుల్లోనే నెలకొల్పడం మరో విశేషంగా ఉంది. ఒకే టీ20 మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు సాధించడం కూడా ఇదే తొలిసారి. సంజూ శాంసన్‌కు టీ20 కెరీర్‌లో ఇది మూడవ శతకం. ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదాడు. మూడవ టీ20లో కూడా శతకం బాదిన విషయం తెలిసిందే.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

 

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sports #Indiateam #Cricket #NewZealand