సీడ్ యాప్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ! ఉపాధి అవకాశాలు సృష్టించే నూతన మార్గం!

Header Banner

సీడ్ యాప్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ! ఉపాధి అవకాశాలు సృష్టించే నూతన మార్గం!

  Mon Sep 30, 2024 17:52        Education, Politics

పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ అందించేలా సీడ్ యాప్ ద్వారా శిక్షణ

- సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి


పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ కార్యాలయం లో చైర్మన్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఎంపిక చేసిన 20 మంది చైర్మన్లతో ముఖ్యమంత్రి మాట్లాడి లక్ష్యాలను నిర్ధేశించారన్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారని, అందుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. సీడ్ యాప్ సంస్థ ద్వారా పరిశ్రమలకు కావాల్సిన శిక్షణను యువతకు ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు.


ఇంకా చదవండిఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!



ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం తో లింక్ అప్ అయిన పథకాలు అనేకం ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఏపీ సీడ్ యాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లు ద్వారా యువతకు శిక్షణ అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభివృద్ధి దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన మాన్ పవర్ ను అందిస్తామని, సెక్టర్ల వారీగా పరిశ్రమల వారితో చర్చిస్తామన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న పథకాలకు ఎటువంటి నిధుల కొరత లేకుండా తప్పక కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుంగా కృషి చేసి అభివృద్ధి చేస్తానన్నారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఎల్ సీ బీటీ నాయుడు, సీడ్ యాప్ సీఈవో ఎం.కే.వీ. శ్రీనివాసులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #seedapp #training #placements #freecourses #jobs #todaynews #flashnews #latestupdate