ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

Header Banner

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

  Mon Sep 30, 2024 18:10        Education, Politics

యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సమావేశమైన ఏపీ హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించిన హోంమంత్రి

అమరావతి, సెప్టెంబర్, 30; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన పొలిటికల్ ఎకనమిక్ చీఫ్ ఫ్రాంక్ టల్లుటో, రీజనల్ సెక్యురిటీ ఆఫీసర్ కలే నందులను హోంమంత్రి కలిశారు. అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయం ఎక్కువగా ఉండడం, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే యువత ఎక్కువవుతుండడం వంటి కీలక అంశాలను హోం మంత్రి అనిత ఈ సందర్భంగా వారితో చర్చించారు. అమెరికా వీసా కోసం ఏపీ యువత,పారిశ్రామికవేత్తలు, పర్యాటకులు పడే ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో 'వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు' చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి అనిత కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన యూఎస్ రాయబార కార్యాలయం సులభతరమైన వీసా విధానానికి గల మరిన్ని అవకాశాలు సహా సెంటర్ ఏర్పాటుపై పరిశీలిస్తామన్నారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో హోంమంత్రి చర్చించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #USA #Homeminister #anitha #usconsolate #beti #visaapplication #center #andhrapradesh #planing #dvelopment #todaynews #flashnews #latestupdate