జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వ‌చ్చేసింది! ప‌రీక్ష‌లు ఎప్ప‌టి నుంచంటే?

Header Banner

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వ‌చ్చేసింది! ప‌రీక్ష‌లు ఎప్ప‌టి నుంచంటే?

  Tue Oct 29, 2024 11:00        Education

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్. జేఈఈ మెయిన్స్‌-2025 షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. ఈసారి కూడా రెండు సెష‌న్స్‌గా మెయిన్స్ నిర్వ‌హిస్తామ‌ని ఎన్‌టీఏ తెలిపింది. జ‌న‌వ‌రిలో తొలి సెష‌న్, ఏప్రిల్‌లో రెండో సెష‌న్ ఉంటుంద‌ని చెప్పింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 22 నుంచి 31వ తేదీ వ‌ర‌కు.. అనంత‌రం ఏప్రిల్‌లో రెండో సెష‌న్ ప‌రీక్ష‌లు ఉంటాయని స్ప‌ష్టం చేసింది.

 

సెషన్‌-1 కోసం సోమవారం (అక్టోబ‌ర్ 28) నుంచే అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎన్‌టీఏ చెప్పింది. అప్లికేష‌న్లు స‌మ‌ర్పించేందుకు న‌వంబ‌ర్ 22 చివ‌రి తేదీ. జనవరి చివరివారంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, సెషన్‌-2కు సంబంధించి జనవరి 31నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 1నుంచి 8వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష గడువు 3గంటలు కాగా, గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో సెక్షన్‌-ఏలో 20, సెక్షన్‌-బీలో 5ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌లో 100మార్కుల చొప్పున మొత్తం 300మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

 

ఇంకా చదవండివైసీపీకి మాజీ మంత్రి విడదల రజిని రాజీనామా? ఇది ఎంతవరకూ నిజం?  

 

జేఈఈ మెయిన్స్‌-2025 షెడ్యూల్‌ వివరాలు…

సెషన్‌-1 : ఆన్‌లైన్‌ దరఖాస్తులు – 28-10-2024 నుంచి 22-11-2024 రాత్రి 9.00గంటల వరకు.
అప్లికేషన్‌ ఫీజు చెల్లించేందుకు గడువు- 22-11-2024(రాత్రి 11.50గం.ల వరకు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో సవరణలు- ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఇస్తారు.
సిటీ ఇంటిమేషన్‌- జనవరి-2025మొదటి వారంలో వెల్ల‌డిస్తారు.

ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు గడువు- పరీక్ష తేదీకి 3రోజుల ముందు.
పరీక్ష తేదీలు- జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య(టెంటటివ్‌)
ఫలితాలు- ఫిబ్రవరి 12వ తేదీ వరకు. 

 

సెషన్‌-2: ఆన్‌లైన్‌ దరఖాస్తులు- 31-01-2025 నుంచి 24-02-2024 రాత్రి 9.00గం.ల వరకు
అప్లికేషన్‌ ఫీజు చెల్లింపు గడువు- 24-02-2024(రాత్రి 11.50గం.ల వరకు)
సిటీ ఇంటిమేషన్‌- మార్చి రెండో వారం
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌- పరీక్షకు మూడు రోజుల ముందు
పరీక్ష తేదీలు- ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 8మధ్య(టెంటటివ్‌)
ఫలితాలు- ఏప్రిల్‌ 17వ తేదీవరకు 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పరీక్ష గడువు…

పేపర్‌-1(బీఈ/బీటెక్‌)- 3గంటలు
పేపర్‌-2(బీ.ఆర్క్‌)-3గంటలు
పేపర్‌-2బీ(బీ.ప్లానింగ్‌)-3గంటలు
బీ.ఆర్క్‌, బీ.ప్లానింగ్‌(బోత్‌)- 3.30గంటలు

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Education #India #JEE #JEEMains