అమెరికా: పెరిగిన ఖర్చులు, వేతనాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు...

Header Banner

అమెరికా: పెరిగిన ఖర్చులు, వేతనాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు...

  Thu Jan 25, 2024 12:33        Business, Employment, U S A

అమెరికాలో ఉద్యోగాలు కత్తిమీద సాములా తయారయ్యాయి.

ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో... ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అమెరికాలో గతేడాది ఉద్యోగుల తొలగింపు 98 శాతానికి చేరుకుందని, ఈ ఏడాది అది మరింత దిగజారుతుందన్న నివేదిక వెలువడిన మరుసటి రోజే యూఎస్ ఈ-కామర్స్ దిగ్గజం ఈబే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

తమ మొత్తం ఉద్యోగుల్లో 9 శాతం అంటే దాదాపు 1000 మందిని ఇంటికి పంపాలని నిర్ణయించింది. వ్యాపార వ్యూహాలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ మేరకు సంస్థ సీఈవో జామీ ఇయానోన్ ఉద్యోగులకు లేఖ రాశారు.

ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల వేతనాలు, కంపెనీ వ్యవహారాల ఖర్చులు వ్యాపారానికి మించి ఉండడం వల్ల దానిని పరిష్కరించేందుకు, ఎండ్ టు ఎండ్ అనుభవాన్ని పెంచడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చేందుకు సంస్థాగత మార్పులు అమలు చేస్తున్నట్టు తెలిపారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #eBay #USA #Layoffs #BusinessNews #USANews #USAUnemployment #NOJobsInUSA #USAJobsProblems #USABusinessProblems