అరేయ్ ఇదేదో బాగుందే వారంలో నాలుగు రోజులు మాత్రమే వర్క్ ఆ దేశంలో! పండగ చేసుకుంటున్న ఎంప్లాయిస్..

Header Banner

అరేయ్ ఇదేదో బాగుందే వారంలో నాలుగు రోజులు మాత్రమే వర్క్ ఆ దేశంలో! పండగ చేసుకుంటున్న ఎంప్లాయిస్..

  Tue Jan 30, 2024 15:55        Employment, World

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయని తెలిసిందే.

కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి. 

అయితే, జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి 4 రోజులే పని దినాలుగా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది.

ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వచ్చే ఆర్నెల్ల పాటు ఈ పద్ధతి కొనసాగనుంది. 

జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది.

జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది.

అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితులపై నిర్వహించిన అధ్యయనం...

కొన్ని కీలక సిఫారసులకు బాటలు పరిచింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వారానికి 4 రోజులే పనిచేయడం వల్ల ఉద్యోగులు తాజాగా, ఆరోగ్యకరంగా ఉంటారని, తద్వారా పనిలో చురుకుదనం పెరిగి, ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 

కాగా, 4 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలోని 45 సంస్థలు ముందుకువచ్చాయి.

ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.

వారంలోని నాలుగు రోజుల్లో ఉద్యోగులు కొన్ని గంటల పాటే పనిచేసినా గతంలో చెల్లించిన మేరకే వేతనాలు ఇస్తారు.

అయితే, గతంలో ఎంత పని చేశారో, ఈ నాలుగు రోజుల్లోనూ అదే స్థాయిలో ఉత్పాదకతను కనబర్చాల్సి ఉంటుంది. 

వారానికి నాలుగు రోజుల పనిదినాల విధానం కారణంగా, ఉద్యోగులు సెలవులు పెట్టడం తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Germany #GermanyNewRulesForEmployment #NewEmploymentRules #4DaysWorkWeek #Employees #Economy #HighInflation #WorldNews #GermanyEmploymentNews