ఏపీ: DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు...

Header Banner

ఏపీ: DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు...

  Thu Feb 08, 2024 07:05        Education, Employment

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ను బుధవారం మధ్యాహ్నాం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

 

6,100 పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్, 2,280 SGT పోస్టులు ఉన్నాయని, అలాగే 1,264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

AP TET నోటిఫికేషన్ వివరాలు...

ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది... 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ... 23 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, 27 నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్లో టెట్ పరీక్షలు... మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల... మార్చి 11 వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు... మార్చి 13న ఫైనల్ కీ విడుదల... మార్చి 14న టెట్ తుది ఫలితాలు వెల్లడి.

 

అనంతరం టెట్ క్వాలిఫై అయిన వారికి మార్చి 15 నుండి 30 వరకు రెండు దఫాలుగా DSC పరీక్షలు. 31న ప్రాథమిక కీ ... 2న పైనల్ కీ విడుదల... ఏప్రిల్ 7 న తుది ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #DSC #APTET #APTET2024 #DSC2024