ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

Header Banner

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

  Wed Oct 02, 2024 10:25        Employment

త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం : హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

slprb.ap.gov.in వెబ్సైట్ లో పూర్తి వివరాలు : హోంమంత్రి

రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వ చొరవతో మోక్షం

ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు.



ఇంకా చదవండిమంత్రి నారా లోకేశ్ నియోజకవర్గంలో స్కిల్ సెన్సస్ ఆరంభం! ఉద్యోగ‌, ఉపాధి అవకాశాల‌కు!



ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. "హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రి వివరించారు. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. ఈ విషయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చాకా, దీనిపై న్యాయ సలహా తీసుకొని.. ఆ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండవ దశ (PMT/PET)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్సైట్ లో పొందుపరుస్తామని హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండవ ధశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష (Final Written Exam) జరుగుతుందని హోం శాఖా మంత్రి తెలిపారు.



ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #constable #recruitment #post #jobs #notification #homeminister #anitha #todaynews #flashnews #latestupdate