ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

Header Banner

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

  Wed Nov 29, 2023 11:47        Exclusives

పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఉండేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతుంది.

ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం.

ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని ప్రమాణం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలనాలో రాజ్యాంగ స్ఫూర్తికి అడుగున తూట్లు పొడుస్తున్నారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు వీగిపోవడంతో శాసన మండలి రద్దు చేస్తున్నానని వైసీపీ అధినాయకుడు ప్రకటించారు.

ఆయన దుందుడుకు స్వభావానికి రాజ్యాంగమే అడ్డుకట్ట వేసి విధాన సభ కొనసాగుతోంది.

ఒక ప్రభుత్వం తాను అనుకున్నది నెరవేరకపోతే రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయని దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

ప్రజలు ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వాక్ స్వాతంత్రానికి ఆయన ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.

ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తుంది.

ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచితం నిర్ణయాలను ఎండగట్టేందుకు ఏర్పాటు అయిన పత్రిక రంగం పైన ఆయన ప్రభుత్వం దాడి చేస్తుంది.

దేశ అధినేత నుండి రోజు కూలి వరకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కూడా ఆయన చేతిలో ఆట బొమ్మలా తయారైంది.

వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని అధికారులను అధిరించి బెదిరించి ప్రజలకు ఉన్న ఓటు తొలగించేందుకు కూడా ప్రభుత్వం వెనకాడడం లేదు.

రాజ్యాంగబద్ధంగా బాధితులకు అండగా ఉండవలసిన చట్టం న్యాయం కూడా ఆయన పాదాల కింద నలిగిపోతుంది.

రాష్ట్రంలో పేద ప్రజానీకానికి సామాన్యులకు చట్టం అండగా నిలవకపోగా వారిపై ఉక్కు పాదం మోపుతుంది.

ఇక కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయస్థానాలు న్యాయం అందించడంలో జరుగుతున్న ఆలస్యానికి నిర్దోషులు బలవుతున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న నిధులను ప్రజల ప్రయోజనాలకు వినియోగించవలసి ఉండగా అవి కూడా దారి తప్పుతున్నాయి.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఆయన నియంత పాలన సాగుతోంది.

74 ఏళ్ల రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోడానికి తప్ప ఆచరణలో కనిపించడం లేదు.

ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతశ్రేణి అధికారులు కూడా రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతున్నారు.

పాలకులు చేసే తప్పిదాలను సరిదిద్దవలసిన ఐఏఎస్ లో కూడా పాలకులను మించి అవినీతిపరులుగా తయారవుతున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆయన పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా బ్రష్టు పట్టిపోయాయి.

ఆయన చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.

ఇటువంటి పోకడలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా మారి దేశ సమైక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలన్నా, రాజ్యాంగ స్ఫూర్తి నిలుపుకోవాలన్న ప్రజల చేతుల్లో ఉన్న ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది.

త్వరలో జరగబోయే ఎన్నికలలో సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రంగా ఉన్న ఓటు హక్కును వినియోగించుకుని ఇటు ప్రజాస్వామ్యాన్ని అటు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలంటే ఆయన ప్రభుత్వాన్ని ఓడించాలి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   andhrapravasi