యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

Header Banner

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

  Wed Nov 29, 2023 12:56        Devotional, యాత్రా తరంగిణి

యాత్రా తరంగిణి - పరిచయం

 

ప్రముఖ కవి శ్రీ కాపెర్ల పవన్ కుమార్ గారు అన్నమయ్య జిల్లా చిన్న ఓరంపాడు కమ్మపల్లి లో జన్మించారు. తమ స్వగ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలోనే గ్రామంలోని నిరక్షరాస్యులైన వృద్దులకు సాయంత్రం వేళ రామాయణ, భాగవతాలను చదివి వినిపిస్తూ ఆధ్యాత్మికంగా, భాషా సాంస్కృతిక పరంగా ఒక ప్రత్యేకమైన ఇష్టాన్ని తనకు తెలియకుండానే పెంపొందించుకున్నారు.

 

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, హిందీ పండిట్, జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ, ఎం.బి.ఏ. హాస్పిటల్ మేనేజ్మెంట్.. ఇలా పలు విభిన్న విద్యార్హతలు పొందిన పవన్ కుమార్ ప్రస్తుతం వైద్య రంగంలో ముఖ్య పరిపాలనాధికారి గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు.

 

పవన్ కుమార్ గారి సాహితీ ప్రయాణం మన కువైట్ ఎన్నారైస్.కామ్ తోనే మొదలు పెట్టడం విశేషం.
కువైట్ ఎన్నారైస్, చప్పిడి బ్రదర్స్ సహకారంతో 2015 లో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కవితల పోటీలో తన తొలి కవితకు ప్రథమ బహుమతి పొందడం నుండి ప్రారంభమైన ఆయన ప్రస్థానం... నేడు పేరెన్నికగన్న సాహితీ సంస్థలచే అంతర్జాతీయ స్థాయిలో సన్మాన సత్కారాల తో పాటు... స్వర్ణ కంకణం తొడిగించుకునే వరకు కొనసాగింది.

 

 

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై "ద్వారకాధినాధునికి అక్షారాభిషేకం" పేరుతో సంకీర్తనా యజ్ఞం నిర్వహిస్తున్న పవన్ కుమార్ గారు, దక్షిణ భారతావని లో దర్శించిన కొన్ని పుణ్య క్షేత్రాల వివరాలు, ఆయా క్షేత్రాల చరిత్రలు, దేవాలయ నిర్మాణం, సాంప్రదాయాలు మొదలగు విషయాలు "యాత్రా తరంగిణి" పేరుతో మన ఆంధ్ర ప్రవాసి తో పంచుకోనున్నారు.

 

ఈ ధారా వాహిక యొక్క పరిచయం వారి మాటల్లోనే తెలుసుకుందాం... "ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి, తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరం అవుతాయి. శిధిల అవస్ధలో ఉన్న దేవాలయాల్లో కూడ నేటికీ పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉన్న దేవాలయాలను దర్శంచి మనంతా గర్వపడాలి. మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కాని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో మనకు అంతా తెలియవు. అవేంటో మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం." అని పవన్ గారు అన్నారు

 

ఈ యాత్రా తరంగిణి ధారా వాహిక ద్వారా దేవాలయాలు, గురించిన ఆధ్యాత్మిక కేంద్రాల విశేషాలు, ప్రత్యేకతలు, విశిష్టతలు తెలుసుకోడానికి తప్పకుండా ఆంధ్ర ప్రవాసిని వీక్షించండి. ఈ వారం నుంచి ఆంధ్రప్రవాసి.కామ్ లో మీ ముందుకు రాయబోతుంది. మీరూ అందరూ ఈ మధుర అనుభూతిని పొంది మరో 10 మంది కి షేర్ చేస్తారని కోరుతూ, ఈ ధారావాహిక ఆదరిస్తారని ఆశిస్తూ... మీ అమూల్యమైన సలహాలు, సూచనలను andhrapravasi@andhrapravasi.com ఈమెయిల్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ... మీరు కూడా మీ రచనలను ప్రపంచానికి తెలియచేయాలి అనుకుంటున్నారా, అయితే మీ రచనలు, కవితలను మా ఈమెయిల్ andhrapravasi@andhrapravasi.com కి పంపించండి మేము మా వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తాము ...


మీ
ఆంధ్రప్రవాసి.కామ్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 



   andhrapravasi, yatratarangini, devotional