మిచౌంగ్‌ తుపాన్‌...ఇలాంటి సందర్భంలో ట్రావెలింగ్ చేస్తున్నారా అయితే! మీకోసం కొన్ని జాగ్రత్తలు...

Header Banner

మిచౌంగ్‌ తుపాన్‌...ఇలాంటి సందర్భంలో ట్రావెలింగ్ చేస్తున్నారా అయితే! మీకోసం కొన్ని జాగ్రత్తలు...

  Mon Dec 04, 2023 17:24        Auto, Others

తుపాన్‌: మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని విశాఖపట్టణం, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తునే ఉన్నాయి.

తెలంగాణ జిల్లాల్లోనూ మిగ్‌జాం ప్రభావం ఉంది. పలు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. తుపాను కారణంగా విమాన రాకపోకలు రద్దు అయ్యాయి. డిసెంబర్‌ 5 ఉదయం మచిలీపట్నం- బాపట్ల తీరం మధ్య నిజాంపట్నం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది.

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అవసరం లేని ప్రయాణాలను రద్దు చేసుకోవడం ఉత్తమం. భారీ వర్షాలు కారణంగా వాహనాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. లేదా ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.

వాహనాన్ని తనిఖీ చేయండి: తుపాను వంటి పరిస్థితుల్లో సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నట్లయితే వాహనాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం కావడంతో వాహనం వైపర్లు పనితీరు ఎలా ఉందో చూడాల్సి ఉంది. టైర్లు, బ్రేక్‌ల పనితీరు మరియు హెడ్‌లైట్ల పనితీరును తనిఖీ చేయాల్సి ఉంటుంది.

వాహనాల మధ్య దూరం పాటించండి: వర్షాకాలం సహా తుపాన్ వంటి సందర్భాల్లో వాహనాన్ని నడపాల్సి వస్తే.. ముందున్న వాహనంతో సరైన దూరం పాటించాల్సి ఉంటుంది. ముందున్న వాహనం అకస్మా్త్తుగా నిలిచిపోయినా లేదా ఏదైనా ప్రమాదం తలెత్తినా... మన వాహనానికి ప్రమాదం జరగకుండా కనీస దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.

హెడ్‌లైట్లు ఆన్‌ చేయండి: తుపాన్‌ సమయంలో డ్రైవింగ్‌ చేయాల్సి వస్తే వాహనం హెడ్‌లైట్లు ఆన్‌ చేసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు మన ఆచూకి తెలిసే అవకాశం ఉంటుంది. వర్షం కురుస్తున్నప్పుడు ఉదయం పూట అయినా లైట్లు ఆన్‌ చేసి వాహనాన్ని డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది.

వాహన వేగం: వర్షం కురుస్తున్న సమయంలో రోడ్లపై వాహనాలు ట్రాక్షన్‌ కోల్పోయే అవకాశం ఉంది. లేదా వేగంగా ప్రయాణం చేస్తున్న ఇతర వాహనాలు మీ వాహనాన్ని ఢీకొట్టే అవకాశం కూడా ఉంది. అందువల్ల తక్కువ వేగంతో వాహనాన్ని డ్రైవింగ్‌ చేయడం ఉత్తమం.

ముందున్న వాహనాన్ని అనుసరించడం ఉత్తమం: వర్షం కురుస్తున్న సమయంలో రోడ్లపై ఉన్న గుంతలు సహా సింక్‌ హోల్‌లు సరిగా కనిపించే అవకాశం ఉండదు. అందువల్ల ముందు వెళ్తున్న వాహన మార్గాన్ని అనుసరించడం వల్ల దారిలో ఎక్కుడ గుంతలున్నా మనం ముందుగా అప్రమత్తం కావచ్చు. మరియు సురక్షితంగా ప్రయాణం కొనసాగించవచ్చు.

కారు విండ్‌ షీల్డ్‌: వర్షాకాలంలో ‌ప్రయాణం చేస్తున్నప్పుడు కారు బయట పరిస్థితులు మరియు లోపల పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల మార్పు కారణంగా కారు కిటికీలు పొగమంచు అలుముకుంటుంది. కారు ఏసీ లేదా హీటర్‌ను ఆన్‌చేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

క్రూయిజ్‌ కంట్రోల్ ఫీచర్‌: ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న చాలా వాహనాలు క్రూయిజ్‌ కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి. వేసవి, శీతాకాలంలో క్రూయిజ్‌ కంట్రోల్‌ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు... ఆఫ్‌చేసి పెట్టుకోవడం ఉత్తమం...

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #traveling #driving #heavyrain #nighttravel #rain #auto