పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు... ఒరేయ్ ఆడపిల్లలు ఆడపిల్లల దొంగోడిని పట్టుకున్నారు!

Header Banner

పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు... ఒరేయ్ ఆడపిల్లలు ఆడపిల్లల దొంగోడిని పట్టుకున్నారు!

  Sat Jan 27, 2024 10:39        India

సికింద్రాబాద్‌లోని పీజీ ఉమెన్ హాస్టల్‌లోకి అగంతకుడు చొరబడడం కలకలం రేపింది.

బాత్రూం కిటికీ నుంచి దుండగుడు లోనికి చొరబడ్డాడు.

అనంతరం విద్యార్థినులకు సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా అతడిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మొత్తం ముగ్గురు యువకులు లోపలికి చొరబడినట్టు విద్యార్థినులు చెబుతున్నారు.

దుండగుడు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని విద్యార్థులు పేర్కొన్నారు.

హాస్టల్‌లో తమకు రక్షణ కరువైందని, వెంటనే సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Secunderabad #PGHostel #Thief #WomenStudents #ThiefInWomenHostel