నొప్పి తెలియకుండా నైట్రోజన్ గ్యాస్​తో ఖైదీకి మరణ శిక్ష అమలు..

Header Banner

నొప్పి తెలియకుండా నైట్రోజన్ గ్యాస్​తో ఖైదీకి మరణ శిక్ష అమలు..

  Sat Jan 27, 2024 10:55        World, U S A

హత్య కేసులో దోషికి నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి మరణ శిక్షను అమెరికాలోని అలబామా రాష్ట్రంలో అమలు చేశారు. ఇలా నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్షను అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

అలబామాలో ఓ ఫాస్టర్ భార్య హత్య కేసులో దశాబ్దాలుగా జైల్లో ఉన్న కెన్నత్ యూజీన్ స్మిత్ (58)కు నైట్రోజన్‌ హైపోక్సియా విధానంలో మరణ దండన విధించారు.

నైట్రోజన్‌ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్‌ ద్వారా నిందితుడి ముక్కుకు బిగించి, గ్యాస్‌ను విడుదల చేయగానే ఆక్సిజన్‌ అందక ఖైదీ అపస్మారక స్థితిలోకి జారుకుని ఆ తర్వాత మరణించాడు.

ఈ ప్రక్రియకు మొత్తం 22 నిమిషాల పట్టింది.

అధిక మోతాదులో నైట్రోజన్‌ కారణంగా ఆక్సిజన్ అందక దోషి బాధను అనుభవిస్తూ మరణిస్తాడు. శ్వాస అందనప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో...

అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాలను తీశారు. 1988లో చార్లెస్ సెన్నెట్ అనే మత ప్రబోధకుడు తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను యూజీన్ స్మిత్, అతడి సహాయకుడు జాన్ పార్కర్‌లకు సుపారీ ఇచ్చిన హత్య చేయించినట్టు తేలింది.

ఇందు కోసం ఒక్కొక్కరికి 1,000 డాలర్లు చొప్పున చెల్లించినట్టు విచారణలో వెల్లడయ్యింది. చార్లెస్‌ భార్యను స్మిత్, పార్కర్‌ అతి కిరాతకంగా హత్య చేశారు.

అనంతరం పోలీసులకు దొరికిపోతామనే భయంతో చార్లెస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కేసులో ఇద్దర్నీ న్యాయస్థానం దోషులుగా నిర్దారించి మరణశిక్ష విధించింది.

దీంతో 2010లో విషపు ఇంజక్షన్ ద్వారా పార్కర్‌కు మరణశిక్ష అమలు చేశారు. స్మిత్‌కు కూడా 2022లో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాలని ప్రయత్నించినా అది విఫలమైంది.

ఇంజెక్షన్ ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడం వల్ల ఆ శిక్ష నిలిపేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈలోగా అలబామా కోర్టు డెత్‌ వారెంట్‌ గడువు ముగియడంతో తాజాగా నైట్రోజన్‌ గ్యాస్‌ ద్వారా స్మిత్‌కు మరణ శిక్షను అమలు చేశారు అధికారులు.

కాగా, నైట్రోజన్‌ హైపోక్సియా పద్ధతితో మరణ శిక్ష అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ శిక్షను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘ కోరింది. అటు, స్మిత్‌ కుటుంబ సభ్యులు కూడా శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని క్షమాభిక్ష కోరింది.

అయితే, ఈ విజ్ఞప్తులను అలబామా కోర్టు తోసిపుచ్చింది. ఆక్సిజన్‌కు బదులుగా అతని ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన నైట్రోజన్‌ని పంపేందుకు అతని ముఖంపై రెస్పిరేటర్ మాస్క్‌ని ఉంచారు.

ఈ ప్రక్రియ దాదాపు 22 నిమిషాల పాటు కొనసాగి అతను ఊపిరాడక చనిపోయాడు.

‘స్మిత్్ సుమారు రెండు నుంచి నాలుగు నిమిషాలు విలవిలలాడిపోతూ ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు భారీ శ్వాస తీసుకున్నాడు’ అని మీడియా సాక్షులు తెలిపారు.

అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ కమీషనర్ జాన్ హామ్ విలేకరులతో మాట్లాడుతూ.. స్మిత్ తట్టుకోగలిగినంత సేపు ఊపిరి బిగబట్టి కనిపించాడని తెలిపారు.

స్మిత్ గురువారం ఉదయం చివరిగా స్టీక్, హాష్ బ్రౌన్స్, గుడ్లతో భోజనం చేశాడు. ఉరితీసినప్పుడు తన భార్య, ఇతర బంధువులను దీనంగా చూస్తూ ఉన్నాడని చెప్పారు.

మరణ శిక్ష అమలు చేసినప్పుడు మీడియా సాక్షిగా ఐదుగురు జర్నలిస్టులకు గ్లాస్‌ల నుంచి చూసేందుకు అనుమతించారు.

‘ఈ రాత్రి అలబామాలో మానవత్వం ఒక అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence