భారతీయ రైల్వే: 10 నిమిషాల్లో సీటు వద్దకు రాకపోతే సీటు కాళీ .. ఇదెక్కడి రూల్ రా బాబు అంటున్న ప్రయాణికులు

Header Banner

భారతీయ రైల్వే: 10 నిమిషాల్లో సీటు వద్దకు రాకపోతే సీటు కాళీ .. ఇదెక్కడి రూల్ రా బాబు అంటున్న ప్రయాణికులు

  Mon Jan 29, 2024 11:59        India, Travel

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలన్నా... కేదరీనాథ్ ఆలయాన్ని సందర్శించాలన్నా... సుదీర్ఘ ప్రయాణం చేయాలి.

భారతీయులందరికీ తక్కువ చార్జీతో ప్రయాణం చేయడానికి అనువైన మార్గం రైలు ప్రయాణం.

సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఐఆర్సీటీసీ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ, నేరుగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ లో గానీ టికెట్ బుక్ చేసుకుంటారు.

కానీ, టికెట్ బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్ తర్వాత రెండు, మూడు స్టేషన్లలో రైలు ఎక్కుతుంటారు...

ఇక నుంచి అలా చేయకుండా కానీ ఇప్పుడు భారతీయ రైల్వే కొత్త రూల్స్ తీసుకు రానున్నది.

దీని ప్రకారం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్ లోనే రైలు ఎక్కి, 10 నిమిషాల్లోపు తమకు రిజర్వ్ చేసిన సీటు వద్దకు చేరుకోవాలి.

అలా చేరుకోక పోతే టికెట్ కలెక్టర్... మీ రిజర్వ్ చేసుకున్న సీటు ఖాళీగా ఉన్నదని గుర్తిస్తారని చెబుతున్నారు.

ఆ సీటును మరో ప్రయాణికుడికి టికెట్ కలెక్టర్ కేటాయిస్తారని తెలుస్తున్నది.

టికెట్ రిజర్వ్ చేసుకున్న స్టేషన్ తర్వాతీ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏ సీటులో ప్రయాణికులు ఉన్నారు...

ఏ సీటు ఖాళీగా ఉన్నదన్న సంగతి గుర్తించడంలో సమస్య ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.


   #AndhraPravasi #Cancelled #IndianRailway #TicketRules #NewRuleIndianRailway